కుర్చీల కోసం వెంపర్లాడే నువ్వా మాట్లాడేది.. సి.కళ్యాణ్‌పై బుజ్జి ఫైర్ (వీడియో)

శుక్రవారం, 17 నవంబరు 2017 (13:31 IST)

nallamalupu bujji

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై చెలరేగిన వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. పైగా, ఈ చిచ్చు మరింతగా రాజుకుంటుంది. టీవీల్లో ప్రత్యేక చర్చకు దారితీసింది. దీంతో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ, నువ్వెంత అంటే నువ్వెంత అంటూ బూతులు తిట్టుకుంటున్నారు. 
 
ముఖ్యంగా, అల్లు అర్జున్‌తో 'రేసుగుర్రం' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత నల్లమలుపు బుజ్జి మరో నిర్మాత, అవార్డుల జ్యూరీ కమిటీ సభ్యుడైన సి.కళ్యాణ్‌పై మండిపడ్డారు. దీనిపై ఒక ఛానెల్ చేపట్టిన చర్చలో ఆయన మాట్లాడుతూ, నంది అవార్డులను గొప్ప సినిమాలకు ఇచ్చామని జ్యూరీ సభ్యులు గుండెమీద చెయ్యేసుకుని చెప్పగలరా? అని బుజ్జి ప్రశ్నించారు. 
 
ఇంతలో నిర్మాత సి.కళ్యాన్‌‌కు టీవీ చానెల్ ఫోన్‌ చేయడంతో లైన్‌లోకి వచ్చారు. అపుడు అవార్డులపై మీ అభిప్రాయం ఏంటి? అని ప్రశ్నించగా, జ్యూరీ నిర్ణయాన్ని ప్రశ్నించడం సరికాదని కళ్యాణ్ సమాధానమిచ్చారు. నంది అవార్డులు మంచి సినిమాలకే ఇచ్చారని అభిప్రాయపడ్డారు. తామంతా సినీ కుటుంబమని, ఇలా రచ్చెకెక్కి వివాదం చేయడం సరికాదని కోరారు. 
 
దీంతో చిర్రెత్తుకొచ్చిన నల్లమలుపు బుజ్జి ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. 'నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా వరకు అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలలో కుర్చీలలో కూర్చునే నువ్వా? ఏది మంచి సినిమా? ఏది చెడ్డ సినిమా? అని చెప్పేది? మీరు కుర్చీల్లోంచి తప్పుకుని కొత్తవారికి అవకాశమివ్వండి' అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇద్దరూ నువ్వెంత? అంటే నువ్వెంత? అన్న రీతిలో వాదులాడుకున్నారు.
 దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పవన్ నాకు తమ్ముడు కాదు కొడుకు... చిరంజీవి

అవును. వాడికి తిక్కుంది. కానీ తిక్కకు లెక్క మాత్రం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసిపోయి ...

news

30 యేళ్లుగా భరిస్తున్న ఫ్యాన్స్‌కు థ్యాంక్స్.. జగ్గూ భాయ్ (వీడియో)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై హీరో కమ్ విలన్ జగపతిబాబు ...

news

నంది అవార్డులు కాదు.. పచ్చ అవార్డులు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నంది అవార్డులపై సినీ పరిశ్రమకు చెందిన ...

news

కుటుంబ కథా చిత్రమ్ ట్రైలర్

నందు, శ్రీముఖి, కమల్ కామరాజు కీలక పాత్రలు పోషించిన కుటుంబ కథా చిత్రమ్ సినిమా టీజర్ ...