గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (17:55 IST)

నా అభిమాన హీరోతో కలిసి నటించా.. 50 టేకులు తీసుకున్నా?: సాయిపల్లవి

సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్న తమిళ సినిమా ఎన్జీకే సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమా మే 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సూర్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్నారు. ఈ సందర్భంగా సాయిపల్లవి ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ..  సూర్యతో కలిసి నటించడం అదృష్టమని చెప్పుకొచ్చింది. 
 
తన అభిమాన హీరోతో కలిసి నటించే అవకాశం వస్తుందని తాను అనుకోలేదని.. అలాంటిది సూర్యతో కలిసి నటించడం, ఆయన్ని దగ్గరగా చూడటం ఆశ్చర్యమేసిందని చెప్పింది. సెట్లోని వాళ్లందరినీ సూర్య తన కుటుంబసభ్యుల్లా చూసుకుంటారు. వాళ్ల బాగోగులను అడిగి తెలుసుకుంటారు. 
 
ఆయన కాంబినేషన్లోని ఒక సీన్ కోసం తాను 50 టేకులు తీసుకున్నా, ఆయన విసుక్కోలేదు. ఎంతో ఓపికతో వుంటూ ప్రోత్సహించారు. అలాంటి వ్యక్తిని తాను చూడలేదని సాయిపల్లవి వెల్లడించింది. ఇలా సూర్యను 50 టేకులు తీసుకుని చాలా ఇబ్బంది పెట్టానని ఫిదా భామ వెల్లడించింది.