బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 2 సెప్టెంబరు 2017 (13:38 IST)

"కణం"గా వస్తున్న నాగ శౌర్య, సాయి పల్లవి…

టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య ప్రేక్షకుల ముందుకు "కణం"గా రానున్నారు. ఈ చిత్రంలో ఫిదా హీరోయిన్ సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. కోలీవుడ్‌ దర్శకుడు ఏ.ఎల్‌. విజయ్‌ కరు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పూ

టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య ప్రేక్షకుల ముందుకు "కణం"గా రానున్నారు. ఈ చిత్రంలో ఫిదా హీరోయిన్ సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. కోలీవుడ్‌ దర్శకుడు ఏ.ఎల్‌. విజయ్‌ కరు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పూర్తి స్థాయిలో హారర్‌ అండ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీని లైకా ప్రొడక్షన్ నిర్మిస్తోంది.
 
అయితే, ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను తాజాగా విడుదల చేసింది చిత్ర యూనిట్‌. ఇక ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రంలో 'పెళ్లి చూపులు' ప్రియదర్శి కీలక పాత్రలో కనిపించనున్నాడు. తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న ఈ మూవీని వీలైనంత త్వరగా షూటింగ్‌ను పూర్తి చేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.