Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మారి-2లో ఫిదా హీరోయిన్.. ధనుష్ సరసన సాయిపల్లవి

శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (13:13 IST)

Widgets Magazine

ప్రేమమ్ సినిమాలో మలర్ పాత్రలో, ఫిదా చిత్రంలో భానుమతిగా అలరించిన సాయిపల్లవి ప్రస్తుతం బంపర్ ఛాన్స్ కొట్టేసింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ హీరోగా నటించిన ''మారి'' సినిమా సీక్వెల్‌లో నటించే అవకాశాన్ని కైవసం చేసుకుంది. 
 
హీరోయిన్ పాత్ర ఈ సినిమాలో వైవిధ్యంగా వుంటుందని.. అందుకే సాయిపల్లవి ఈ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్ వస్తోంది. ముందు నుంచి నటనకు ప్రాధాన్యత గల పాత్రల్లో కనిపిస్తానని చెప్పుకొస్తున్న సాయి పల్లవి.. సినీ ఛాన్సుల ఎంపిక ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే మారి-2 సినిమాకు పచ్చజెండా ఊపిందని టాక్. 
 
అంతేగాకుండా.. త‌మిళ హీరో ధ‌నుష్ నటించిన మారి (తెలుగులో మాస్‌) సినిమాకు సీక్వెల్‌గా తెర‌కెక్కనున్న ''మారి-2" చిత్రం కోసం సాయి ప‌ల్ల‌విని హీరోయిన్‌గా ఎంచుకున్న‌ట్లు నిర్మాణ సంస్థ వూండ‌ర్‌బార్ ఫిల్మ్స్ ధ్రువీకరించింది. 
 
ఇప్పటికే పీఎల్ విజ‌య‌న్ 'కణం' సినిమా ద్వారా తమిళతెరకు పరిచయం అవుతున్న సాయిపల్లవి.. ధనుష్ సినిమాలో నటించడం ద్వారా తమిళ ప్రేక్షకుల మదిని దోచుకోవడం ఖాయమని సినీ పండితులు అప్పుడే జోస్యం చెప్తున్నారు. మారి-2 సినిమా తమిళ, తెలుగు భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి బాలాజీ మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి టీజర్ దసరాకు లేనట్టే.. దీపావళికి ఖాయం?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా టీజర్ ...

news

సమంత పెళ్లికి తర్వాత నటించే సినిమా ఏంటి? మిథాలీ రాజ్ బయోపికేనా?

నాగ చైతన్య-సమంత వివాహం అక్టోబర్ 6న జరగబోతోంది. పెళ్లి పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఈ ...

news

పవన్ ఆ పని చేశారు.. అందుకే ఆయనంటే ఇష్టం: శివబాలాజీ

ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ అంటే తనకు చాలా ఇష్టమని బిగ్ బాస్ సీజన్ 1 విజేత శివబాలాజీ ...

news

తమ్ముడు దుమ్ము దులిపావ్.. జూనియర్‌తో కళ్యాణ్ రామ్.. వంద కొట్టావ్!

జై లవకుశ సినిమాతో జూనియర్ ఎన్ టిఆర్ క్రేజ్ పెరగడమే కాదు తెలుగు చిత్రసీమలో ఒక సరికొత్త ...

Widgets Magazine