ఫస్ట్ లుక్‌లో ఇరగదీసిన "శైలజారెడ్డి అల్లుడు"

అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని నాగచైతన్య హీరోగా, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం "శైలజారెడ్డి అల్లుడు". ఈ చిత్రంలో శైలజారెడ్డి పాత్రను సీనియర్ నటి రమ్యకృష్ణ పోషిస్తోంది. ఈ చి

sailajareddy alludu movie still
pnr| Last Updated: సోమవారం, 9 జులై 2018 (13:29 IST)
అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని నాగచైతన్య హీరోగా, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం "శైలజారెడ్డి అల్లుడు". ఈ చిత్రంలో శైలజారెడ్డి పాత్రను సీనియర్ నటి పోషిస్తోంది. ఈ చిత్రం యూత్‌ను.. మాస్‌ను.. ఫ్యామిలీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తున్నారు.
 
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను కొద్దిసేపటి క్రితం చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో శైలజా రెడ్డిగా కీలకమైన పాత్రను రమ్యకృష్ణ పోషించారు. కథలో ఆమె పాత్రకి గల ప్రాధాన్యత కారణంగానే ఫస్టులుక్ పోస్టర్‌లోనూ ఆమెను హైలైట్ చేశారు.
 
కథలో ప్రధానంగా కనిపించే మూడు పాత్రలను కవర్ చేస్తూ ఈ ఫస్టులుక్ పోస్టర్‌ను డిజైన్ చేశారు. చైతూ, అనూ ఇమ్మాన్యుయేల్ హ్యాపీ మూడ్‌లో వుంటే, అది తట్టుకోలేకపోతున్న ఎక్స్‌ప్రెషన్‌తో రమ్యకృష్ణ కనిపిస్తోంది. 
 
ఒకప్పుడు పొగరుబోతు అత్త పాత్రలను వాణిశ్రీ అద్భుతంగా పండించారు. ఇప్పుడు ఆ స్థానంలో రమ్యకృష్ణ అదరగొట్టేయనున్నారన్న మాట. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. దీనిపై మరింత చదవండి :