శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: గురువారం, 26 జులై 2018 (19:50 IST)

మేము తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాం... మీరు సాక్ష్యం చూడండి... పూజా హెగ్దె(Video)

తిరుమల శ్రీవారిని సాక్ష్యం సినిమా చిత్ర యూనిట్ దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సాక్ష్యం చిత్రం హీరో శ్రీనివాస్, హీరోయిన్ పూజా హెగ్దె, చిత్ర దర్శకుడు శ్రీవాస్ దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వీ

తిరుమల శ్రీవారిని సాక్ష్యం సినిమా చిత్ర యూనిట్ దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సాక్ష్యం చిత్రం హీరో శ్రీనివాస్, హీరోయిన్ పూజా హెగ్దె, చిత్ర దర్శకుడు శ్రీవాస్ దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వీరికి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసారు. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందచేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
 
అనంతరం మీడియాతో మాట్లాడిన హీరో శ్రీనివాస్ సినిమా విడుదలకు ముందు స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చానని అన్నారు. ఒక కొత్త కథతో సాక్ష్యం సినిమాతో మీ ముందుకు వచ్చామని శ్రీనివాస్ తెలిపారు. పంచభూతాలపై తీసిన సినిమా ఇదనీ, ఖచ్చితం థియేటర్లో చూడాల్సిన సినిమా అని శ్రీనివాస్ పేర్కొన్నారు. స్వామి వారి దర్శనానికి తిరుమలకు వచ్చానని పూజ హెగ్దె తెలిపారు. సాక్ష్యం టీంతో పనిచేయటం చాలా సంతోషంగా ఉందని పూజ అన్నారు. తిరుమలలో సాక్ష్యం టీం... వీడియో చూడండి.