రిటైర్ అయ్యే ముందు ఓ బేబీ చేసినందుకు సంతోషం... సమంత షాకింగ్
సమంత అక్కినేని - నందినీ రెడ్డి కాంబినేషన్‌లో రూపొందిన విభిన్న కథా చిత్రం ఓ బేబీ. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిల్మ్స్, క్రాస్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. జులై 5న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా రామానాయుడు స్టూడియోలో ఏర్పాటు చేసిన మీడియా మీట్‌లో సమంత మాట్లాడుతూ... నేను మంచి సినిమాలు చేయాలి లేకపోతే ఇంట్లో కూర్చోవాలి అనుకున్నాను. అలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత వచ్చిన సినిమాలు రంగస్థలం, మహానటి, సూపర్ డీలక్స్, మజిలీ.
నా నిర్ణయం వలన క్లియర్ అయిపోయింది. నాకు ఒక బాధ ఉండేది. నేను రిటైరయ్యే ముందు ఫుల్ ఫ్లెడ్జ్ కామెడీ సినిమా చేయలేదని. ఓ బేబీ ద్వారా ఆ కోరిక తీరింది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది.
ఓ బేబీ ఒక కామెడీ చిత్రం మాత్రమే కాదు. ఈ సినిమా కొరియన్ వెర్షన్ చూసిన వెంటనే నా మదర్‌ని హగ్ చేసుకోవాలి అనిపించింది. అమ్మ.. నువ్వు ఏం సాధించాలి అనుకున్నావు అని ఎప్పుడు అడగలేదు. నేను యాక్టర్ అయ్యాను. నా కలను నిజం చేసుకున్నాను. మీ కల ఏంటి అని పేరెంట్స్ ని ఎప్పుడు అడగం.
ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు వెళ్లి అమ్మా... నీ కల ఏంటి అని అడుగుతారు. హగ్ చేసుకుంటారు. ప్రతి తల్లి పిల్లల కోసం చాలా త్యాగం చేస్తుంది కానీ... వాటి గురించి ఎప్పుడూ మాట్లాడరు. అందుకే ఈ సినిమాని రీమేక్ చేయాలని నిర్ణయం తీసుకున్నాను.
సురేష్ ప్రొడక్షన్స్‌లో ఈ సినిమా చేయడం చాలా హ్యాపీ. సురేష్ గారు జులై 5న రిలీజ్ అని ఎనౌన్స్ చేసిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది. ఆయన ఓకే అంటే... ఆల్రెడీ 99% ఓకే అన్నమాట అనిపించింది.
సురేష్ గారు ఏంటంటే... నీకు షూటింగ్ అయిపోయింది. పని అయిపోయింది అలా ఏం లేదు. ఇంకా తెలుసుకోవాలి అని చెబుతుంటారు. యాక్టర్ సినిమా చేసి అయిపోయింది నా పని అనేలా ఉండకూడదు. ఈ సినిమా వలన నాకు రెస్పాన్స్‌బులిటీ వచ్చింది. దాని వలన ఎడిటింగ్ రూమ్‌కి ఓ పదిసార్లు వెళ్లాను. ఈ సినిమా ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా సినిమాకి సంబంధించి అన్నింటిలో బాధ్యతగా ఉండాలని తెలుసుకున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు సురేష్ మామకు థ్యాంక్స్.
సురేష్ ప్రొడక్షన్స్ 55 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంలో ఓ బేబీ రావడం చాలా గర్వంగా ఉంది. ఈ సినిమా అనుకోగానే నా గురించి ఆలోచించి నా దగ్గరకి వచ్చిన సునీతకు థ్యాంక్స్. ఓ బేబీ నా కెరీర్లో చాలా స్పెషల్ ఫిల్మ్ అవుతది. నాకు కష్టమైన డైలాగ్స్ ఇచ్చినందుకు భూపాల్ గార్కి థ్యాంక్స్. పేజీల పేజీల డైలాగులు... అది కూడా గోదావరి స్లాంగ్ డైలాగులు. నాకు చాలా కొత్తగా అనిపించింది. వెరీ ఛాలెంజింగ్ ఎక్స్‌పీరియన్స్. ఈ సినిమాకి సాంగ్స్ కూడా బ్యాక్‌బోన్‌లా ఉంటాయి. లక్ష్మీ గారితో కలిసి వర్క్ చేయడం చాలా హ్యాపీ. మా ఇద్దరి హైట్ కూడా సేమ్. అన్నీ అలా కుదిరాయి.
రాజేంద్రప్రసాద్ గారు నాకు కామెడీ ట్రైనింగ్ ఇచ్చారు.. థ్యాంక్యూ సార్. ఈ సినిమాలో నటించిన తేజ చాలా టాలెంటెడ్. స్పెషల్ అప్పీయరెన్స్ అయినా నటించడానికి ఒప్పుకున్న నాగశౌర్యకు థ్యాంక్స్. ఈ టీమ్ వెరీవెరీ క్లోజ్ టు మై హార్ట్. జులై 5న ఓ బేబీ రిలీజ్ అవుతుంది. అందరూ చూసి బాగుంది అంటే చాలాచాలా సంతోషంగా ఉంటాను అన్నారు.