Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హైదరాబాదులో సమంత, నాగచైతన్య రిసెప్షన్: నవంబర్ 12న ఫిక్స్ అయ్యిందా?

గురువారం, 2 నవంబరు 2017 (14:02 IST)

Widgets Magazine

టాలీవుడ్ ప్రేమపక్షులు నాగచైతన్య, సమంత ఒకింటి వారైన సంగతి తెలిసిందే. అక్టోబర్ 6న చైతూ, సమంత వివాహం గోవాలో అట్టహాసంగా జరిగిన సంగతి విదితమే. గోవాలో పెళ్లి తంతు ముగిసిన వేళ.. హైదరాబాదులో సమ్మూ, చైతూ రిసెప్షన్ వుంటుందని అందరూ అనుకున్నారు. అయితే వీరి వివాహ రిసెప్షన్ రద్దు అయ్యిందని ఆపై వార్తలు వచ్చాయి. 
 
రిసెప్షన్‌కు అయ్యే ఖర్చును పేద పిల్లల కోసం ఖర్చు చేస్తే సరిపోతుందని సమంత చెప్పడంతో అది క్యాన్సిల్ అయ్యిందని వార్తలొచ్చాయి. ఈ గ్యాప్‌లో దగ్గుబాటి కుటుంబం ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్ ఇటీవలే చెన్నైలో జరిగింది. చెన్నైలో నాగచైతన్య తల్లి లక్ష్మీ అక్కడి స్నేహితుల కోసం ఓ రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దగ్గుబాటి కుటుంబ సభ్యులంతా హజరయ్యారు.
 
ఈ నేపథ్యంలో త్వరలోనే హైదరాబాద్‌లో జరగబోయే రిసెప్షన్‌కు అక్కినేని కుటుంబం​ గ్రాండ్‌‌గా ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్‌ 12న ఈ వేడుకను నిర్వహించనున్నారట. ప్రస్తుతం షూటింగ్‌‌ల నుంచి విరామం తీసుకున్న ఈ జంట రిసెప్షన్‌ తరువాత తిరిగి షూటింగ్‌లకు హజరయ్యేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఈ వివాహ రిసెప్షన్ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తారని తెలుస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

#HappyBirthdaySRK : బర్త్‌డే బాయ్ బాలీవుడ్ బాద్ షా

బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తర్వాత అంతటి పాపులారిటీ కలిగిన హీరో ...

news

''బోగన్'' దర్శకుడికి షాకిచ్చిన మాస్ మహారాజా: తలపట్టుకున్న లక్ష్మణ్?

మాస్ మహారాజా రవితేజ రీమేక్‌ల జోలికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో ...

news

పన్ను ఎగ్గొట్టలేదు... బోటు రైడ్‌కి వెళ్లాలనుకుంటున్నా... అమలాపాల్

పన్ను ఎగ్గొట్టిన కేసులో మలయాళ బ్యూటీ అమలాపాల్ తలతిక్కగా వ్యాఖ్యలు చేస్తోంది. విదేశాల ...

news

కొత్తగా ఇద్దరు హీరోయిన్లతో శర్వానంద్ రొమాన్స్: నివేదా, షాలినీ పాండే రెడీ..

''శర్వానంద్'' సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. సుధీర్ వర్మతో చేసే తాజా సినిమాలో ...

Widgets Magazine