ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 28 ఆగస్టు 2017 (10:33 IST)

అర్జున్ రెడ్డి ఇరగదీశాడంటున్న కేటీఆర్.. సమంత ఏం చెప్పింది? ఏకంగా 16 కిస్సింగ్ సీన్లా?

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, షాలిని పాండే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో అర్జున్ రెడ్డి అనే చిత్రం విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుంది. విడుద‌ల‌కి ముందు అనేక వివాదాలు ఈ చిత్రాన్ని చుట్టుముట్టినా చివరికి సక్సెస్ అయ్యింది.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, షాలిని పాండే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో అర్జున్ రెడ్డి అనే చిత్రం విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుంది. విడుద‌ల‌కి ముందు అనేక వివాదాలు ఈ చిత్రాన్ని చుట్టుముట్టినా చివరికి సక్సెస్ అయ్యింది. సందీప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అర్జున్ రెడ్డి చిత్రం తెర‌కెక్కింది. ప్రస్తుతం భారీ విజయాన్ని నమోదు చేసుకున్న ఈ చిత్రంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. 
 
ఈ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ ఇరగదీశాడంటూ కొనియాడారు. దర్శకుడు సందీప్ రెడ్డి అద్భుతంగా తెరకెక్కించారని కితాబిచ్చారు. నిజాయతీని ప్రతిబింబించే, మనసును హత్తుకునే సినిమా ఇదని తెలిపారు. ఇలాంటి రిస్కీ సినిమా తీయాలంటే ఎంతో ధైర్యం ఉండాలన్నారు. 
 
మరోవైపు టాలీవుడ్ అందాల హీరోయిన్ సమంత కూడా అర్జున్ రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించింది. అర్జున్ రెడ్డి సినిమా అద్భుతంగా ఉందంటూ ప్రముఖ  సమంత కితాబిచ్చింది. ఈ సందర్భంగా ఓ ట్వీట్ చేసింది. చాలాకాలం తర్వాత తాను చూసిన సహజసిద్ధమైన సినిమా అర్జున్ రెడ్డి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి గోల్డెన్ డేస్ వచ్చేశాయ్... అంటూ ట్వీట్ చేసింది. ఇప్పటికే అర్జున్ రెడ్డి సినిమాపై యంగ్ హీరోలు నాని, వరుణ్ తేజ్, మంచు మనోజ్ కొనియాడుతూ ట్వీట్ చేశారు. అలాగే హీరోయిన్లలో అను ఇమ్మాన్యుయేల్, మెహ్రీన్, లక్ష్మీ మంచు అర్జున్ రెడ్డిపై ప్రశంసలు గుప్పించారు. 
 
ఇదిలా ఉంటే.. విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి చిత్రంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 కిస్సులు ఉన్నాయి. దీంతో బాలీవుడ్ కిస్సింగుల వీరుడు ఇమ్రాన్ హష్మీ వారసుడిగా అర్జున్ రెడ్డి మారిపోయాడని సినీ జనం అంటున్నారు.
 
సినిమా రిలీజ్‌కి ముందు కేవ‌లం రెండు లిప్ లాక్స్ సీన్లే వున్నాయని సెన్సార్ చెప్పినప్పిటికీ.. విడుద‌ల త‌ర్వాత ఇన్నిముద్దు సీన్ల‌ని చూసి సినీ ప్రేక్ష‌కులు ఖంగు తిన్నారు. ఇమ్రాన్ హ‌ష్మీని విజయ్ దేవరకొండ మించిపోతాడా అని సినీజనం అంటున్నారు. కొన్ని డ‌బుల్ మీనింగ్ డైలాగులు కూడా ఈ చిత్రంలో వున్నాయట. ఏది ఏమైనప్పటికీ.. విజయ్ దేవరకొండ కేవలం లిప్ లాక్ సీన్స్‌తోనే కాదు త‌న ప‌ర్‌ఫార్మెన్స్‌తోను అదరగొట్టి.. క్లాస్, మాస్ హృదయాలను దోచుకున్నాడు.