Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మరికొన్ని గంటల్లో సమంత నా కోడలు... నాగ్ ట్వీట్

శుక్రవారం, 6 అక్టోబరు 2017 (16:41 IST)

Widgets Magazine

టాలీవుడ్‌లో మరో ప్రేమ వివాహం జరుగబోతోంది. ఈ ప్రేమ వివాహానికి పెద్దలు ఆమోద ముద్ర వేయడంతో ఆ జంట ఆనందానికి అవధుల్లేవు. ఆ జంటే నాగచైతన్య-సమంత. సమంత మరికొన్ని గంటల్లో తన కోడలు కాబోతోందంటూ నాగార్జున ట్వీట్ చేశారు. 
Samantha-Nagarjuna
 
''ఏ మాయ చేసావె'' సినిమా ద్వారా జంటగా నటించిన సమంత, నాగ చైతన్యలకు వివాహ వేదికపై స్పెషల్ సర్‌ప్రైజ్ రెడీ అవుతోంది. శుక్రవారం గోవాలో నిరాడంబరంగా చైతూ, సమ్మూ వివాహం జరుగనుంది. ఈ నేపధ్యంలో అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తం కలసి సమంతకు వెల్‌కమ్ చెబుతూ ఓ చిన్న వీడియోను రూపొందించారు. 
 
వివాహం జరుగుతున్నప్పుడు ప్రదర్శించేందుకు ఈ వీడియోను రూపొందించారని, దీని గురించి సమంత, చైతూలకు తెలియదని సమాచారం. సమంతకు సర్‌ప్రైజ్‌గా ఈ వీడియోను కానుకగా ఇవ్వాలని భావించిన రెండు ఫ్యామిలీలూ ఆమెకు స్వాగతం చెబుతూ కనిపిస్తాయట. ఈ వీడియోలో అక్కినేని నాగార్జున, అమల, అఖిల్‌తో పాటు రానా, సుమంత్ ఇందులో కనిపిస్తారని సమాచారం.
 
ఈ వీడియో సమంతకు స్వీట్ షాకింగ్‌గా వుంటుందని వారి కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అలాగే నాగార్జున కూడా సమ్మూ-చైతూ కోసం అన్నపూర్ణ స్టూడియోలో కొత్త కాటేజీ కట్టిస్తున్నారని.. ఇందులో అత్యాధునిక పరికరాలు.. విదేశీ వస్తువులను వుంచినట్లు తెలుస్తోంది.
 
ఇక ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా చైతూ జంటకు శుభాభినందనలు చెబుతూ కామెంట్ల వరద పారిస్తున్నారు. 'ఏమాయ చేశావే' దర్శకుడు గౌతమ్ మీనన్ ను ప్రస్తావిస్తుండటం విశేషం. వీరిద్దరి ప్రేమకు బీజం వేసింది గౌతమేనని, ఆయన ఫోటోను పూజ గదిలో పెట్టుకుని జీవితాంతం పూజించుకోవాలని సలహాలు కూడా ఇస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఐటీ రంగంలో అదో మోసం... నేను కిడ్నాప్‌ అయ్యాను రివ్యూ...

నేను కిడ్నాప్‌ అయ్యాను సినిమా నటీనటులు: పోసాని కృష్ణమురళీ, బ్రహ్మానందం, కార్టూనిస్ట్‌ ...

news

రేణుకు చిన్మయి సపోర్ట్... విరుచుకుపడుతున్న పీకే ఫ్యాన్స్

జీవితాంతం ఒంటరిగా జీవించలేనని, రెండో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన మదిలో వచ్చిందంటూ పవన్ ...

news

జరుగు.. జరుగెహె... తిరుపతిలో రకుల్ ప్రీత్ సింగ్... ఎవరిని...

తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోయిన్‌గా వెలుగొందుతున్న రకుల్ ప్రీత్ సింగ్ తిరుపతిలో సందడి ...

news

సమంతకు సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఏంటదో తెలుసా?

''ఏ మాయ చేసావె'' సినిమా ద్వారా పరిచయమైన...ఆపై ప్రేమ పక్షులుగా మారి.. ప్రస్తుతం ...

Widgets Magazine