బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 జనవరి 2022 (23:04 IST)

మహేష్ బాబుతో మళ్లీ రొమాన్స్ చేయనున్న సమంత? (video)

Samantha Akkineni
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు జోడీగా సమంత మూడు సినిమాల్లో నటించింది. దూకుడు, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం వంటి సినిమాల్లో సమంత నటించింది. తాజాగా 'శాకుంతలం' వంటి భారీ బడ్జెట్ సినిమాతో గుణశేఖర్‌ కలిసి పనిచేస్తోంది సమంత. ఇక ప్రస్తుతం సమంత చేస్తున్న 'యశోద' సినిమా కూడా కథాకథనాల పరంగా సమంత స్థాయిని పెంచేదే. 
 
ఇక త్రివిక్రమ్ సినిమా కోసం కూడా సమంతను సంప్రదిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే స్పెషల్ సాంగ్ కోసం కాదు .. హీరోయిన్ గానే. మహేశ్‌తో త్రివిక్రమ్ చేయనున్న సినిమాకి మొదట్లో పూజ హెగ్డేను అనుకున్నారు. కానీ పూజా హెగ్డే డేట్స్  సర్దుబాటు కాకపోవడంతో సమంతను తీసుకోనున్నట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్‌తో సమంత అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అ ఆ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.