Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చైతూ.. ప్లీజ్, నన్ను వెళ్లనివ్వొద్దు.. నా విమానం టేకాఫ్‌ అవుతుందా? అంటున్న సమంత

శుక్రవారం, 16 జూన్ 2017 (12:54 IST)

Widgets Magazine

టాలీవుడ్ హీరోయిన్ సమంత ఓ చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ కోసం నెల రోజుల పాటు తమిళనాడులోని తెన్‌కాశిలో షెడ్యూల్‌కు ఆమె వెళ్లాల్సి ఉంది. అయితే, నెల రోజుల పాటు అంతదూరం వెళ్లేందుకు ఏమాత్రం ఇష్టంలేని సమంత... సోషల్ మీడియా వేదికగా చేసుకుని మూడు ప్రశ్నలను సంధించింది.
samantha
 
ఇంత సుదీర్ఘమైన షెడ్యూల్‌ కోసం వెళ్లటానికి ముందు.. అసలు నేనెందుకు వెళ్లాలో మూడు కారణాలు చెప్పండి? అంటూ నాగచైతన్యనో లేక ఆ సినిమా నిర్మాతనో కానీ ఆసక్తికర ప్రశ్నలు వేసి... చైకి దూరంగా వెళ్లడం ఇష్టం లేదని చెప్పకనే చెప్పింది. ఇంతకీ ఆమె వేసిన ప్రశ్నలు ఏంటంటే... 1) వర్షం పడే అవకాశముందని వాతావరణశాఖ చెబుతున్న వేళ షూటింగ్ జరుగుతుందా? 2) ఒక వేళ నేను అనారోగ్యానికి గురవుతానేమో? 3) అసలు నా విమానం టేకాఫ్‌ అవుతుందా? అని ప్రశ్నించింది. చైతన వెళ్లాల్సిందే అన్నట్టున్నాడు. అందుకే... ప్లీజ్‌ నన్ను వెళ్లనివ్వొద్దు అంటూ వేడుకుంది. 
 
కాగా, వచ్చే అక్టోబరు నెల ఆరో తేదీన హిందూ క్రైస్తవ పద్దతుల్లో సమంత, నాగ చైతన్యలు ఒక్కటి కానున్న విషయం తెల్సిందే. వీరిద్దరి వివాహం గోవాలో జరుగనుంది. తమ ప్రేమానుబంధాలను సోషల్ మీడియాలో పలు సందర్భాల్లో సమంత వ్యక్తం చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చైతూని విడిచి వెళ్లలేక... తన గోడు సోషల్ మీడియాలో వెల్లబోసుకుంది. దీనికి నిదర్శనంగా నాగచైతన్య గుండెలపై నిద్రిస్తున్న ఫోటోను ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో షేర్‌ చేసింది. ఈ పోస్టు అందర్నీ ఆకట్టుకుంటోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

తమిళ సినీపరిశ్రమ ఇక నాదే - మహేష్‌

మహేష్‌ బాబేంటి.. తమిళ సినీపరిశ్రమలో నెంబర్ ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పటికే విజయ్, సూర్య ...

news

అపూర్వం... అనితర సాధ్యం.. బాహుబలి-2 సినిమా..1050 సెంటర్లలో 50 రోజులు

భారతీయ చలనచిత్ర చరిత్రలో ఇదొక చిరస్మరణీయ ఘట్టం. గత 85 సంవత్సరాల దేశీయ చలనచిత్ర పరిశ్రమ ...

news

నానుంచి లేట్ కానివ్వను.. మీరే స్పీడ్ పెంచండి.. కాబోయే పెళ్లికూతురు అభ్యర్థన

ఏం మాయ చేశావే అని నాగచైతన్యతో తొలి సినిమాలో అనిపించుకుని చివరకి అతడినే మాయ చేసి ఒడిలో ...

news

మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రారంభ చిత్రంగా బాహుబలి 2

భారతీయ చలనచిత్ర చరిత్రలో చిరస్మరణీయమైన రికార్డులను సాధించిన, నేటికీ సాగిస్తున్న బాహుబలి 2 ...

Widgets Magazine