బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 25 మార్చి 2024 (09:46 IST)

సమంత శరీరంలో నశించిపోయిన శక్తి.. అందుకే స్పృహ కోల్పోయిందట!!

samantha
హీరోయిన్ సమంత శరీరంలో శక్తి నశించిపోయింది. దీంతో ఆమె నటిస్తున్న "సిటాడెల్" వెబ్ సిరీస్‌ షూటింగ్ సమయంలో ఆమె స్పృహ తప్పి కిందపడిపోయింది. ఈ విషయాన్ని ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. సమంత గత కొంతకాలంగా మయొసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెల్సిందే. అదేసమయంలో ఆమె సిటాడెల్ ఇండియన్ వెర్షన్ వెబ్ సిరీస్‌లో నటిస్తుంది. ఈ సందర్భంగా గతంలో తాను ఎదుర్కొన్న శారీరక కష్టాలను, రుగ్మతలను మరోమారు గుర్తు చేసుకున్నారు. సిటాడెల్ షూటింగ్ సమయంలో కొన్నిసార్లు తల తిరగడం, మరికొన్నిసార్లు మూర్ఛపోవడం వంటివి జరిగాయని గుర్తు చేసుకున్నారు. 
 
"ప్రతి ఒక్కరి జీవితంలో చీకటి రోజులు అనేవి ఉంటాయన్నారు. వాటిని భరించి ఓర్పుతో ముందుకెళితే కేరీర్ చాలా అందంగా ఉంటుందని తెలిపారు. నాకు మయొసైటిస్ క్రమక్రమంగా తగ్గుతుంది. మానసికంగా బలంగా ఉంటేనే దేన్నైనా జయించవచ్చు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాను. ఈ సమస్య వల్ల సిటాడెల్ షూటింగ్ ఎంతో క్లిష్టంగా మారింది. శారీరకంగా బలహీనంగా ఉన్నప్పటికీ సిరీస్‌లో చాలా సీన్స్ ఉంటాయని తెలిసినా అంగీకరించాను. ఒక రోజు యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుండగా నాలో శక్తి నశించింపోయింది. చాలా నీరసంగా అయిపోయాను. స్పృహ కోల్పోయి కిందపడిపోయాను. దీంతో సెట్‌లో అందరూ టెన్షన్ పడ్డారు. ఈ సిరీస్‌ షూటింగ్‌ను ఎంతో కష్టపడి చేశానో నాకు మాత్రమే తెలుసు. అందుకే నా కెరీర్‌లోనే ఇది ఎంతో స్పెషల్. దీని రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అంటూ పేర్కొన్నారు.