1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 11 మార్చి 2024 (23:50 IST)

కాలేయం ఆరోగ్యంపై 33 మిలియన్ల మందిని సమంత పక్కదోవ పట్టిస్తోంది

Samantha Ruth Prabhu
ఫోటో కర్టెసీ- ఇన్‌స్టాగ్రాం
సమంత రూత్ ప్రభు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల యూట్యూబ్‌లో ఆరోగ్యం ఆధారిత పాడ్‌కాస్ట్‌ను విడుదల చేశారు. దానికి ‘టేక్ 20: హెల్త్ పాడ్‌క్యాస్ట్ సిరీస్’ అని పేరు పెట్టారు. పోడ్‌కాస్ట్ మొదటి ఎపిసోడ్ 'అండర్‌స్టాండింగ్ ఆటో ఇమ్యూనిటీ' పేరుతో 3 వారాల క్రితం ఫిబ్రవరి 19న విడుదల చేసారు. ఆ తర్వాత రెండవ ఎపిసోడ్ 'డిటాక్స్ పాత్‌వేస్' పేరుతో ఫిబ్రవరి 29న వచ్చింది. ఈ రెండు ఎపిసోడ్‌లలో ఆరోగ్య సమస్యల గురించి వెల్‌నెస్ కోచ్- న్యూట్రిషనిస్ట్ అల్కేష్ షరోత్రితో కలిసి చర్చించారు. 'డిటాక్స్ పాత్‌వేస్' మధ్యలో పాడ్‌కాస్టర్లు డాండెలైన్ అనే హెర్బ్ కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉత్తమ ఔషధం అని చెప్పారు. దీనిపై ప్రముఖ వైద్యుడు తీవ్ర అభ్యంతరం తెలియజేసారు.
 
ఆరోగ్యం గురించి తెలియని ఇద్దరు నిరక్షరాస్యులు కాలేయం ఆరోగ్యం గురించి చెబుతున్నారనీ, వారు 33 మిలియన్ల మందిని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ విమర్శించారు. ట్విట్టర్ వేదికగా ఆయన తన వ్యాఖ్యలను పోస్ట్ చేసారు. "వెల్నెస్ కోచ్ నిజమైన వైద్యుడు కూడా కాదు. కాలేయం పనితీరు గురించి బహుశా ఆయనకు అసలు తెలియదు" అని డాక్టర్ తన ట్విట్టర్ ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నాడు. కాలేయాన్ని ఆరోగ్యంగా వుంచుతుందని సమంత, అల్కేష్‌లు వ్యాపింపజేస్తున్న 'డాండెలైన్' అనేది చాలా మంది ప్రజలు కలుపు మొక్కగా భావించే ఒక కూరగాయ అని, ఒక వ్యక్తికి 10-15 శాతం పొటాషియం అందించడానికి సలాడ్‌లలో దీనిని ఉపయోగించవచ్చని తెలిపారు.
 
డాండెలైన్ మూత్ర ఉత్పత్తిని పెంచుతుంది, సాంప్రదాయ ఔషధం నివేదికల ప్రకారం అది మూత్రవిసర్జన లేదా వాటర్ పిల్ లాగా పని చేస్తుంది. ఐతే ఇది కాలేయం ఆరోగ్యాన్ని సంరక్షిస్తుందని వాళ్లెలా చెబుతున్నారోనంటూ వెల్లడించారు. మరి దీనిపై సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి.