గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వి
Last Modified: శనివారం, 7 నవంబరు 2020 (17:15 IST)

తన భారీ కటౌట్ చూసి ఆశ్చర్యపోయిన సమంత

తనకు సంబంధించిన ఓ భారీ కటౌట్ చూసి సమంత ఆశ్చర్యంలో మునిగారు. ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ కోసం సమంత హోస్ట్‌గా మారుతున్న విషయం తెలిసిందే. ఆహా పలు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలను రూపొందిస్తుండగా ఇందులో భాగంగా హీరోయిన్ సమంత హోస్ట్‌గా సామ్ జామ్ అనే షో రూపుదిద్దుకుంటోంది.
 
ఈ షోకు సంబంధించిన ఓ భారీ కటౌట్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఆహా కార్యాలయంపై ఈ భారీ కౌటౌట్ పెట్టారు. ఈ వీడియోను సమంత తన ట్విట్టర్ ఖాతాలో పెట్టింది. లేడీ సూపర్ స్టార్ సమంత బిగ్గెస్ట్ పోస్టర్ ఇది అంటూ ఆహా వీడియో పేర్కొంది. స్టార్లకు పెద్ద ఇగో ఎందుకు ఉంటుందని దీన్ని చూసి ఆశ్చర్యపోతారంటూ తన పోస్టర్ గురించి సమంత కామెంట్ చేసింది. ఇదిలా ఉండగా ఈ నెల 13 నుంచి ఈ షో ప్రీమియర్లు ప్రారంభం అవుతాయి.