గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఎం
Last Modified: మంగళవారం, 11 మే 2021 (22:10 IST)

టీఎన్నార్ కుటుంబానికి రూ.50 వేలు ఆర్థికసాయం చేసిన సంపూర్ణేశ్ బాబు

ప్రముఖ సినీ పాత్రికేయుడు టీఎన్నార్ కరోనా మహమ్మారికి బలైన నేపథ్యంలో ఆయన కుటుంబానికి నటుడు సంపూర్ణేశ్ బాబు ఆర్థికసాయం చేశారు. టీఎన్నార్ అర్ధాంగి జ్యోతి బ్యాంకు ఖాతాలో తాను రూ.50 వేలు జమ చేసినట్టు సంపూర్ణేశ్ బాబు వెల్లడించారు.

టీఎన్నార్ ఇంటర్వ్యూ ద్వారా తాను వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా ఒక మెట్టు పైకెదిగానని వినమ్రంగా తెలిపారు. ఆయన కుటుంబానికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా, తనవంతు సాయం తప్పకుండా చేస్తానని సంపూ మాటిచ్చారు.

ఇతరులు కూడా టీఎన్నార్ కుటుంబానికి ఆసరాగా నిలవాలని పిలుపునిచ్చారు. తన ట్వీట్‌లో టీఎన్నార్ భార్య జ్యోతి బ్యాంకు ఖాతా నెంబరు, తదితర వివరాలను పంచుకున్నారు.