మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 నవంబరు 2020 (16:54 IST)

వెబ్ సిరీస్‌లో సానియా మీర్జా.. మిర్చీ మమ్మీ అంటూ యువీ..?

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇపుడు నటనతో ఆకట్టుకునేందుకు సిద్ధమవుతుంది. ఎంటీవీ నిషేధ్ ఎలోన్ టుగెదర్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించనుంది. 5 ఎపిసోడ్స్‌లుగా సాగే వెబ్ సిరీస్ ఎంటీవీ నవంబర్ చివరి వారం నుంచి ప్రసారం కానుంది. 
 
భారత్‌లో ట్యుబర్య్కులోసిస్‌పై అవగాహన కల్పించేలా ఈ సిరీస్ కొనసాగనుంది. టీబీ నిరంతరం పీడిస్తున్న సమస్య అని, కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో చాలా ప్రభావం చూపించే అవకాశముంటుందని సానియామీర్జా అభిప్రాయపడింది. ఎంటీవీ సమర్పిస్తున్న ఈ షోతో చేపట్టే సమిష్టి కృషి ద్వారా దేశంలో సానుకూల మార్పు తీసుకునేందుకు దోహదపడుతుందని సానియామీర్జా ఆకాంక్షించింది.
 
ఇదిలా ఉంటే.. సానియా మీర్జా 34వ ఏట అడుగుపెట్టింది. ఈ సందర్భంగా భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సానియాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.సానియాను "మిర్చీ మమ్మీ" అని ప్రస్తావించిన యువీ టెన్నిస్ స్టార్‌కు ఇది అద్భుతమైన సంవత్సరం కావాలని కోరుకున్నాడు.