శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 మే 2022 (17:39 IST)

రూ.100 కోట్లకు పైగా గ్రాస్ షేర్‌ను కలెక్ట్ చేసిన "సర్కారువారి పాట"

Sarkaru Vaari Paata
ప్రిన్స్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం "సర్కారువారి పాట". పరశురాం దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలపై నిర్మించారు. ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సోమవారం వరకు రూ.95 కోట్లకు పైగా షేర్‌ను సాధించగా, మంగలవారం రూ.100 కోట్లకు పైగా షేర్‌ను వసూలు చేసిందని ఫిల్మ్ ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. 
 
కాగా, ఈ చిత్రం ఇప్పటివరకు రూ.160 కోట్లకి పైగా గ్రాస్‌ను, రూ.100 కోట్లకు పైగా షేర్‌ను వసూలు చేసింది. అయితే, ఈ కలెక్షన్లను అధికారింగా ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. నిజానికి ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమా ఈ రేంజ్‌లో తన దూకుడును చూపిస్తుండటం పట్ల ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 
 
కాగా, ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూర్చగా, మహేశ్ మార్క్ కామెడీ, సముద్రఖని విలనిజం ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. అలాగే, ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతోంది.