ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 మే 2022 (11:45 IST)

ఫ్యాన్స్ కోసం భ్రమరాంభ థియేటర్‌లో "సర్కారువారి పాట" రిలీజ్

sarkarivari pata
ప్రిన్స్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం "సర్కారువారి పాట". ఈ చిత్రం కోసం మహేష్ ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. కరోనా కారణంగా వాయిదాపడుతూ వస్తున్న ఈ చిత్రం మే12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. అయితే, విడుదల తేదీ సమీపిస్తుండంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. 
 
ఇందులోభాగంగా, ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. మే 2వ తేదీ సాయంత్రం 4.05 గంటలకు ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే, తన అభిమానుల కోసం అంతకుముందే హైదరాబాద్ భ్రమరాంభ థియేటర్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ఈ చిత్రం మాసివ్ మాస్ ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. 
 
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి పరశురాం దర్శకుడు. ఈయన "గీతగోవిందం" వంటి సక్సెస్ సినిమా తర్వాత దర్శకత్వం వచ్చిన చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఎస్.థమన్ సంగీత దర్శకుడు.