గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 27 జనవరి 2023 (12:47 IST)

సత్యదేవ్ పాన్ ఇండియా మూవీ టైటిల్ జీబ్రా

sathydev zebra
sathydev zebra
వెర్సటైల్ హీరో సత్యదేవ్‌, కన్నడ స్టార్ డాలీ ధనంజయ కలిసి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో క్రైమ్ యాక్షన్ ఎంటర్‌టైనర్  చేస్తున్నారు.  సత్యదేవ్, డాలీ ధనంజయ ఇద్దరికీ ఇది 26వ ప్రాజెక్ట్. ఈరోజు (జనవరి 26) రిపబ్లిక్ డే సందర్భంగా మేకర్స్ ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు.
 
ఈ చిత్రానికి  ‘జీబ్రా’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్ లోగోకు స్పీడోమీటర్ అమర్చపడి వుంది.  దీనిలో  చెస్ పీసస్ వైట్ నైట్, బ్లాక్ నైట్ లని కూడా గమనించవచ్చు. చెస్ ఆటలో నైట్ ఒక తెలివైన మూవ్. ‘లక్ ఫెవర్స్ ది బ్రేవ్’ అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. టైటిల్ లాగే టైటిల్ పోస్టర్ కూడా ఆకట్టుకునేలా ఉంది.  ఇది తప్పకుండా సినిమాపై ఆసక్తిని కలిగిస్తుంది. నిజానికి, ట్యాగ్‌లైన్ ,పోస్టర్‌లోని విషయాలు లీడ్ రోల్స్ యొక్క తెలివిగల స్వభావాన్ని సూచిస్తున్నాయి.
 
పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ పతాకాలపై ఎస్ఎన్ రెడ్డి, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్న ఈ చిత్రంలో  ప్రియా భవానీ శంకర్, జెనిఫర్ పిచినెటో కథానాయికలుగా నటిస్తున్నారు.  వెటరన్ యాక్టర్ సత్యరాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.  సత్య ఆకల, సునీల్ ఇతర ముఖ్య తారాగణం.
 
టీమ్ 50 రోజుల మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసింది.  మిగిలిన షూటింగ్ హైదరాబాద్, కోల్‌కతా, ముంబై ప్రాంతంలో ప్లాన్  చేశారు. ఈ పాన్-ఇండియన్ మూవీ కొస మేకర్స్ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్  రవి బస్రూర్‌ని ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.  KGF, KGF2  తో పాటు  భోలా,  మోస్ట్ ఎవైటెడ్ సలార్ వంటి  ప్రాజెక్ట్‌లు కమర్షియల్ గా అతని డిమాండ్ ని   తెలియజేస్తున్నాయ్.
 
‘రవి గారి మ్యూజిక్  చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళుతుంది. అతని మ్యూజిక్ సినిమా సోల్’’ అని  SN రెడ్డి తెలిపారు (పద్మజ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్).
 
“రవి గారి పనితనం ఈ సినిమా స్థాయిని పెంచుతుంది. ఆయన పాటలు, ఒరిజినల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరింగ్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని నిర్మాతలుగా నమ్ముతున్నాం” అన్నారు. బాల సుందరం (ఓల్డ్ టౌన్ పిక్చర్స్).
 
ఈ చిత్రానికి సహ నిర్మాత  సుమన్ ప్రసార బాగే. సినిమాటోగ్రాఫర్ గా సత్య పొన్మార్ పని చేస్తున్నారు. మీరాఖ్ డైలాగ్స్ రాస్తుండగా, అనిల్ క్రిష్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
 
ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం,  హిందీ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.