Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాహుబలిని హాలీవుడ్‌ సినిమాలతో పోల్చలేం.. చూడాలనిపించలేదు: సయానీ

సోమవారం, 4 సెప్టెంబరు 2017 (09:22 IST)

Widgets Magazine

బాహుబలి-2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న వేళ.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి సయానీ గుప్తా షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ మూవీ 'హంగ్రీ' చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన సయానీ నటిస్తోంది. ఈ నేపథ్యంలో ‘బాహుబలి 2’ ట్రైలర్ చూశాక, ఈ సినిమా చూడాలని తనకు అనిపించలేదని, ఇలాంటి సినిమాల్లో నటించే అవకాశం తనకు వచ్చినా కూడా నటించనని సెన్సేషనల్ కామెంట్ చేసింది. ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన బాహుబలి.. తొలి మూడు రోజుల్లోనే రూ.500 కోట్లు, పది రోజుల్లోనే రూ.వెయ్యి కోట్లు వసూలు చేసి భారతీయ సినిమా రికార్డులు తిరగరాసింది.
 
దర్శక దీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ రికార్డులు బద్దలు కొట్టింది. అమెరికాలో హాలీవుడ్‌ చిత్రాలతో పోటీపడి కలెక్షన్ల వర్షం కురిపించింది. కీరవాణి సంగీతం సమకూర్చిన ఈ సినిమాలో ప్రభాస్‌, రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నా, సత్యరాజ్‌, సుబ్బరాజు తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో బాహుబలిని హాలీవుడ్ చిత్రాలతో పోల్చలేమని, అదో భారీ చిత్రం మాత్రమేనని సయానీ తెలిపింది. ‘బజరంగీభాయ్ జాన్’ లాంటి సినిమాల్లో నటించాలని తనకు ఉందని, ఈ సినిమా అద్భుతంగా వుంటుందని సయానీ వెల్లడించింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

యువ హీరోపై మనసుపారేసున్న మలయాళ బ్యూటీ...

కోలీవుడ్ హీరోయిన నయనతార. ఇప్పటికే రెండు ప్రేమల్లో మునిగితేలి, ఆ తర్వాత వారితో తెగదెంపులు ...

news

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ చిత్రం టైటిల్ 'అజ్ఞాతవాసి'?

హీరో పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ ...

news

భగవంతుడు కల్పించిన అరుదైన అవకాశం : జూ.ఎన్టీఆర్

"జై లవ కుశ" వంటి చిత్రంలో నటించడం తనకు భగవంతుడు కల్పించిన అరుదైన చిత్రం అని జూనియర్ ...

news

#PSPK25 : సింపుల్ మెలోడీ.. సింగిల్ షాట్.. త్రివిక్రమ్ స్టైల్.. రాజమౌళి

హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘#PSPK25 మ్యూజిక్ స‌ర్‌ప్రైజ్’ ...

Widgets Magazine