గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 6 జులై 2022 (08:23 IST)

సీనియ‌ర్ ఎడిట‌ర్ గౌతంరాజు క‌న్నుమూత‌

Editor Gauthamraju
Editor Gauthamraju
తెలుగుసినిమారంగంలో సీనియ‌ర్ ఎడిట‌ర్ అయిన గౌతంరాజు ఈరోజు తెల్ల‌వారుజామున క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌స్సు 88 సంవ‌త్స‌రాలు. గ‌త కొంత‌కాలంగా ఆయ‌న ఒంట‌రిగానే వుంటున్నారు. గ‌త‌కొంత‌కాలంగా అనారోగ్యంతో ఇంటివ‌ద్ద‌నే వున్నారు. ఆయ‌న మ‌ర‌ణ‌వార్త తెలిసిన‌వెంట‌నే సినీప్ర‌ముఖులు, శ్రేయోభిలాషులు త‌మ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.
 
చిరంజీవి, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, ఎన్‌.టి.ఆర్‌. రామ్‌చ‌ర‌ణ్ ఎలా అంద‌రి అగ్ర‌నాయ‌కుల చిత్రాల‌కు ఆయ‌న ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు. ఆయ‌న ఎడిటింగ్ చేస్తే ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు, హీరో భ‌రోసాగా వుండేది. అన‌వ‌స‌ర‌మైన లాగ్‌లు లేకుండా కొన్ని మార్పులు చేర్పులు కూడా ఆయ‌న చెబుతుండేవారు. అందుకే ఆయ‌నంటే సినీరంగానికి ప్రీతి. దాదాపు ద‌క్షిణాదిబాష‌ల‌తోపాటు హిందీ సినిమాల‌కు కూడా ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు. అప్ప‌ట్లో ఆది సినిమాకు ఉత్త‌మ ఎడిట‌ర్‌గా అవార్డు అందుకున్నారు. ఆయ‌న భౌతికాయం జూబ్లీహిల్స్‌లోని స్వ‌గృహంలో వుంచారు. బుధ‌వారంనాడు అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయి.