"బబ్బూ మళ్లీ మనం అది చేశాం. ఒక పగలు ఒక రేయి అంతా గుర్తుండేలా"..

shaan muttathil
సందీప్| Last Updated: మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (15:43 IST)
ప్రపంచ వ్యాప్తంగా క్రేజు, కోట్లకు కోట్లు వార్షికాదాయం. తన టాలెంట్‌తో ఇవన్నీ సాధించుకున్నాడు. మేకప్, హెయిర్ డిజైనర్ అంటే అతడే గుర్తుకువస్తాడు. బాలీవుడ్‌లో కథానాయికలందరికీ ఇతనే డిజైనర్. టీవీ, సినిమా ఆర్టిస్టులకు, టాప్ మొడళ్లకు మేకప్ కావాలంటే ఇతడినే పిలుస్తారు. యంగ్ గళ్స్‌లో ఇతడంటే విపరీతమైన క్రేజు. లండన్‌తో సహా పలు దేశాల్లో మేకప్ హెయిర్ డిజైన్ క్లాసులు చెబుతుంటాడు. టాలీవుడ్ భామలతో కూడా ఇతనికి మంచి కనెక్షన్ ఉంది. అతనే షాన్ అలియాస్ షాన్ ముట్టాతిల్.

సాధారణంగా తన వృత్తిలో భాగంగా అతనికి చాలా మంది గళ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ మేకప్ ఆర్టిస్ట్‌తో సన్నిహితంగా ఉండే బెంగళూరు బ్యూటీ నిధి అగర్వాల్‌పై ఆసక్తికర కథనాలు వచ్చాయి. వారిద్దరి మధ్య స్నేహం గురించి చెప్పడానికి అమ్మడుకి ఘాటైన చుంభనం ఇస్తూ దిగిన ఫోటో, స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేస్తూ దిగిన ఫోటోలు సాక్ష్యాలుగా నిలిచాయి. ఈ ఫోటోలు వెబ్‌లో కూడా వైరల్ అయ్యాయి. షాన్ తనను ముద్దుపెట్టుకుంటున్న ఫోటోని సోషన్ మీడియాలో పోస్ట్ చేసి ఆసక్తికరమైన కొటేషన్ కూడా పెట్టింది నిధి.

"జీఎస్‌టీ రీయూనియన్ ఈ రెండూ ప్రేమతో" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. షాన్ నుండి కూడా రిప్లయ్ వచ్చింది. "బబ్బూ మళ్లీ మనం అది చేశాం. ఒక పగలు ఒక రేయి అంతా గుర్తుండేలా.. లవ్ యు లైక్ క్రేజీ.. యు ఆర్ మై స్పెషల్ గాళ్" అని లవ్ ఇమేజ్‌తో షాన్ రిప్లై ఇచ్చాడు. నిధి మాత్రం షాన్ తనకు మంచి స్నేహితుడు మాత్రమే అని చెబుతోంది. ఇతనికి ఒకరు ఇద్దరు కాదు చాలా మంది గళ్ ఫ్రెండ్స్ ఉన్నారు.

అందులో జాక్విలిన్ ఫెర్నాండెజ్.. యూట్యూబ్ స్టార్ అమండా సెర్నీ.. సోఫీ చౌదరి.. దీపా ఖోస్లా, ఇసబెల్లా కైఫ్, శ్రద్ధా కపూర్ ఇలా ఎందరో సెలబ్రిటీలు అతడికి క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్లందరికీ అతడు మేకప్ డిజైనర్‌గానూ పని చేశాడు. ఇండస్ట్రీలో ఉన్న సంబంధాలన్నింటినీ అఫైర్‌లుగా ఊహించుకోవడం సబబు కాదు. మరి షాన్ స్నేహం గురించి నిధి ఇంకా ఏమి చెబుతుందో చూడాలి.దీనిపై మరింత చదవండి :