గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 4 నవంబరు 2023 (18:00 IST)

షారూక్ ఖాన్, రాజ్ కుమార్ హిరాణి డంకీ ప్రధాన పోస్టర్ ఇదే

Dunki new poster
Dunki new poster
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన డంకీ డ్రాప్ 1 ఫ్యాన్స్, ఆడియెన్స్‌కి ఓ ట్రీట్‌లా ఉండింది. కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను ఇది గెలుచుకుంది. స్నేహం, ప్రేమ వంటి అంశాలను బేస్ చేసుకుని నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని హృదయాన్ని ఆకట్టుకునేలా, మనస్ఫూర్తిగా నవ్వుకునేలా డంకీ సినిమాను రూపొందించారు డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి. 
 
శనివారం డంకీ సినిమా నుంచి మేకర్స్ ప్రధాన తారాగణంగా నటించిన యాక్టర్స్ ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు. దీన్ని గమనిస్తే సినిమాలో షారూఖ్ తో పాటు ఐదు ప్రధానమైన పాత్రల్లో తాప్సీ పన్ను, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్, విక్కీ కౌశల్ కనిపించనున్నారని అర్థమవుతుంది. వీరు తమ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎదురైన సవాళ్లేంటి, వాటిని వాళ్లెలా ఎదుర్కొన్నారనేదే సినిమా అని అర్థమవుతుంది. 
 
ఏ జియో స్టూడియోస్‌, రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యాన‌ర్స్‌ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అభిజీత్ జోషి, రాజ్ కుమార్ హిరాణి, క‌ణిక థిల్లాన్ ఈ చిత్రానికి ర‌చ‌యిత‌లు. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో విడుద‌ల‌వుతుంది.