షాక్, పవర్ స్టార్ ఎదురుగా రష్యన్ అమ్మాయి, ఒట్టు.. అలాగైతే చూపించనంటున్న వర్మ...

Power star still
ఐవీఆర్| Last Updated: శుక్రవారం, 10 జులై 2020 (15:44 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ... లాక్ డౌన్ టైమ్‌లో కూడా వరుసగా సినిమాలు తీస్తున్న విషయం తెలిసిందే. క్లైమాక్స్, నగ్నం, మర్డర్.. ఇలా వరుసగా సినిమాలు తీస్తున్న వర్మ పవర్ స్టార్ అంటూ మరో సినిమాని ఎనౌన్స్ చేసాడు. మొన్ననే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసాడు.
Power star still
ఇక తాజాగా పవర్ స్టార్ ఎదురుగా ఓ రష్యన్ అమ్మాయి చీర కట్టుకుని నిలబడి వున్న ఫోటోను వదిలాడు. ఇంకా డైరెక్టర్ త్రివిక్రమ శ్రీనివాస్ ను కూడా వదిలిపెట్టలేదు. ఆయన్నీ లాగేశాడు. ఐతే పవన్ కళ్యాణ్‌ను కించపరుస్తూ అయితే చూపించననీ, కావల్సిస్తే ఒట్టు వేస్తానంటున్నాడు వర్మ.

మరోవైపు మొన్న విడుదలైన ఫస్ట్ లుక్‌లో పవర్ స్టార్ టైటిల్ మధ్యలో టీ గ్లాసు పెట్టాడు. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమా ఎవరి గురించి తీస్తున్నాడో..? అవును.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించే. అయితే... వర్మ మాత్రం తనదైన శైలిలో ఇది ఎవర్నీ ఉద్దేశించి తీస్తున్న సినిమా కాదు అని చెబుతున్నాడు.
Power star still
ఆ ఫస్ట్ లుక్ పోస్టర్లో హీరో ఆలోచిస్తూ కూర్చొని ఉన్నారు. ఈ పోస్టర్ పైన ఎన్నికల తరువాత కథ అని రాసి సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చాడు. పవర్ స్టార్ అభిమానులకు, వర్మకు మధ్య విభేదాలు గత కొన్ని రోజులుగా ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఓసారి ఇక నుంచి మెగా హీరోల గురించి ఎలాంటి ట్వీట్లు చేయడం కానీ.. మాట్లాడటం కానీ చేయను అని చెప్పారు. ఇప్పుడు అదంతా పక్కన పెట్టేసి పవర్ స్టార్ అంటూ వివాదస్పద చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు.
Power star still
ఈ సినిమాతో మరోసారి వర్మ పవన్ అభిమానులను కెలుకుతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. మరి... ఈ సినిమాలో ఏం చెప్పబోతున్నాడో? ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి వివాదాలు వస్తాయో చూడాలి.దీనిపై మరింత చదవండి :