సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 27 డిశెంబరు 2017 (13:27 IST)

ఎవరితోనైనా విదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేయాలనివుంది : యోగితో హారిక

టాలీవుడ్ లఘు చిత్ర దర్శకుడు యోగికి, సినీ నటి హారికకు మధ్య జరిగిన వాట్సాప్ సందేశాలు ఇపుడు మీడియాకు లీక్ అయ్యాయి. ఇవి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

టాలీవుడ్ లఘు చిత్ర దర్శకుడు యోగికి, సినీ నటి హారికకు మధ్య జరిగిన వాట్సాప్ సందేశాలు ఇపుడు మీడియాకు లీక్ అయ్యాయి. ఇవి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా, వ్యక్తిగతంగా తాను సంతోషంగా లేననీ, అలాంటపుడు తాను ఎందుకు విలువలతో ఉండాలంటూ దర్శకుడు యోగితో హారిక వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, ఎవరితోనైనా విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేయాలని ఉందంటూ యోగితో ఆమె చెప్పుకొచ్చారు. 
 
తనను లైంగికంగా వేధించారంటూ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగిపై నటి హారిక లైంగిక వేధింపుల కేసు పెట్టడం, ఈ కేసు విచారణ నిమిత్తం యోగిని విచారణ నిమిత్తం స్టేషన్‌కు పిలిచి హైదరాబాద్ మాదాపూర్ అడిషినల్ డీసీపీ బూటు కాలితో తన్నడం, చెంపలు వాయించడం వంటివి చకచకా జరిగిపోయాయి. ముఖ్యంగా, బూటు కాలితో తన్నిన వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైంది. దీనిపై హైదరాబాద్ పోలీసు కమిషనర్ విచారణకు కూడా ఆదేశించారు. 
 
అయితే, యోగిని డీసీపీ బూటుకాలితో తన్నుతున్న దృశ్యాలను హారిక షూట్ చేసి మీడియాకు లీక్ చేసినట్టు తేలింది. ఈ నేపథ్యంలో హారికకు తనకు మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలను యోగి పోలీసులకు సమర్పించగా, పోలీసులు వాటిని మీడియాలు లీక్ చేశారు. ఇందులో యోగితో హారిక చాలా చనువుగా ఉన్నట్టు తెలుస్తోంది. తన ఆంతరంగిక విషయాలను కూడా యోగితో ఆమె చర్చించింది. 
 
కేసు పెట్టేందుకు రెండు రోజుల ముందు హారికకు, తనకు మధ్య జరిగిన వాట్స్ యాప్ సంభాషణలను యోగి ఇప్పుడు పోలీసులకు ఇవ్వగా, అవిప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ మెసేజ్‌‍లలో "అబ్బాయిలకు ట్రూ అమ్మాయిల ఫాలోయింగ్ ఉంటే వారితో ఆడుకుందాం అనే ఉంటదా?", "ఎందుకు ప్రత్యూకి దొరికారు కల్యాణ్(ఓ ప్రముఖ నిర్మాత కుమారుడు)లాంటి బాయ్ ఫ్రెండ్?", "నాకు దొరికారు మీ లాంటి వాళ్లు" అంటూ మెసేజ్‌లు పెట్టింది. 
 
ఎవరితోనైనా ఒక గంట మాట్లాడితే చాలు, ఏదో చేయాలని చూస్తారని, దాంతో ఉన్న ఫీలింగ్స్ అన్నీ పోతాయని వ్యాఖ్యానించింది. ఇక హారిక మెసేజ్‌లకు సమాధానంగా "నేనేం ప్రొడ్యూస్ కొడుకుని, హ్యాండ్ సమ్ హంక్‌ని కాదుగా మరి", "ట్రూ క్రేజీ గార్ల్స్ పడరు" అని యోగి సమాధానం ఇస్తున్నట్టు పోలీసుకు ఇచ్చిన వాట్స్ యాప్ స్క్రీన్ షాట్స్ లో కనిపిస్తోంది.
 
అంతేకాకుండా, తాను వ్యక్తిగతంగా కూడా పెద్దగా అందంగా కూడా ఉండననీ, అలాంటపుడు తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎందుకు విలువలతో ఉండాలని యోగిని హారిక ప్రశ్నించింది. అంతేకాకుండా, ఎవరితోనైనా విదేశాలకు వెళ్లిపోయి ఎంజాయ్ చేయాలని ఉందంటూ అతనితో వ్యాఖ్యానించడం హారిక వ్యక్తిగత ప్రవర్తన ఏపాటిదో ఇట్టే తెలిసిపోతోంది. ఈ వాట్సాప్ సందేశాల క్లిప్పింగ్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.