Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆ హీరోయిన్ నన్ను రెచ్చగొట్టింది... అందుకే ఆ పని చేశానంటున్న డైరెక్టర్

శనివారం, 23 డిశెంబరు 2017 (13:25 IST)

Widgets Magazine
crime photo

బుల్లితెర ఇండస్ట్రీ షార్ట్ ఫిలిమ్ డైరెక్టర్‌ యోగిని డీసిపి గంగిరెడ్డి కాలితో తన్నడం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలావుంటే షార్ట్ ఫిలిమ్ హీరోయిన్ హారిక చెప్పిన మాటలకు సదరు డైరెక్టర్ విభేదిస్తున్నాడు. అసలేం జరిగిందంటే అంటూ ఇలా చెప్పుకొచ్చాడు. అదంతా రూ.10 వేల కోసం జరిగిన గొడవని తేల్చాడు.
 
తనకు హారిక ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైందన్నారు. అలా పరిచయమైన హారిక తనతో తన వ్యక్తిగత విషయాలు చాలానే షేర్ చేసుకున్నదని వెల్లడించాడు. ఐతే వేరే వ్యక్తి ద్వారా తనకు సంబంధించిన పర్సనల్ విషయాలు బయటకు వచ్చాయి. ఆ విషయాలను నేనే చెప్పానంటూ నాపై గొడవకు దిగింది. ఎంత చెప్పినా విన్లేదు. నా గురించి ఇండస్ట్రీలో తప్పుగా ప్రచారం చేయడం మొదలుపెట్టింది. దీనితో నాకు కోపం వచ్చి ఆమెకు అసభ్యమైన మెసేజ్ చేశాను. 
 
ఇది కేవలం కోపంలో చేసినదే తప్ప తనపై వ్యక్తిగతంగా చేసింది కాదు. కానీ హారిక మాత్రం నాపై కక్ష పెంచుకుని చివరికి ఈ స్థాయికి తెచ్చింది. పోలీసు స్టేషనులో డీసిపి గంగిరెడ్డి తనపై దాడి చేస్తున్న వీడియోను కూడా తను రిలీజ్ చేయలేదనీ, హారికే షూట్ చేసి దాన్ని యూ ట్యూబులో పెట్టిందని చెప్పుకొచ్చాడు. మరి దీనిపై తెలంగాణ పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

డీసీపీ గంగిరెడ్డికి కాలితే ఇలానే ఉంటుంది... (వీడియో)

తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్టు గొప్పగా ...

news

రాజస్థాన్‌లో దారుణం : నదిలో పడిన బస్సు... 30 మంది జలసమాధి (వీడియో)

రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని దుబి ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం ...

news

ఉద్యోగమిప్పించి ప్రేమించాడు.. సహోద్యోగితో సన్నిహితంగా ఉండటంతో చంపేశాడు...

సికింద్రాబాద్‌లో ప్రేమోన్మాది చేతిలో పెట్రోల్ దాడికిగురై 80 శాతం కాలినగాయాలతో ...

news

గుజరాత్ సీఎం పోస్ట్ : విజయ్ రూపానీకి మరో ఛాన్స్...

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీతానై పార్టీని నడిపించిన ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి ...

Widgets Magazine