మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (13:43 IST)

శ్రియ ''గమనం'' ఫస్ట్ లుక్ విడుదల.. గృహిణిలా అదిరే లుక్

Sreya
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రియ ప్రస్తుతం పాన్ ఇండియా నటిస్తోంది. ''గమనం'' అనే సినిమా ద్వారా ఆమె తెరపైకి రానున్నారు. ఈ చిత్రాన్ని రియల్ లైఫ్ డ్రామాగా సుజనా రావు తెరకెక్కిస్తున్నారు. 'గమనం' చిత్రంలో శ్రియ లీడ్ రోల్ చేస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గమనం రూపొందుతోంది. 
 
ఇక శుక్రవారం శ్రియా చరణ్ పుట్టినరోజు సందర్భంగా 'గమనం' ఫిల్మ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దర్శకుడు క్రిష్ ఈ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో చీర కట్టుకొని, మెడలో మంగళసూత్రం మాత్రమే ఉన్న ఒక అతి సాధారణ గృహిణిలా కనిపిస్తున్నారు శ్రియ.
 
ఏ విషయం గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు ఆమె ముఖంలోని భావాలు తెలియజేస్తున్నాయి. మేస్ట్రో ఇళయరాజా సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా సంభాషణలు రాస్తున్నారు. షూటింగ్ మొత్తం పూర్తయిన 'గమనం' చిత్రానికి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.