మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 28 మార్చి 2018 (15:16 IST)

ఆ మొహం ఎపుడైనా టిక్కెట్ కొని సినిమా చూశాడా? శివాజీ రాజా ఫైర్ (వీడియో)

ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వారిపై పరుష పదజాలంతో విమర్శలు గుప్పించిన టీడీపీ నేతలైన ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్, నర్సారావు పేట ఎంపీ రాయపాటి సాంబశివరావులపై తెలుగు సినీ ప్రముఖులు ఆగ్రహావేశాలు వ్యక

ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వారిపై పరుష పదజాలంతో విమర్శలు గుప్పించిన టీడీపీ నేతలైన ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్, నర్సారావు పేట ఎంపీ రాయపాటి సాంబశివరావులపై తెలుగు సినీ ప్రముఖులు ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తూ మండిపడుతున్నారు. ఇలాంటి వారిలో మా అధ్యక్షుడు శివాజీ రాజా, సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ వంటి ప్రముఖులు ఉన్నారు. 
 
తాజాగా శివాజీరాజా మాట్లాడుతూ, విజయవాడలో ఉండే రాజేంద్రప్రసాద్‌ అనే వ్యక్తిది ఎపుడైనా టిక్కెట్ కొని సినిమా చూసిన మొహమేనా అంటూ మండిపడ్డారు. దేవుడితో సమానమైన ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీలో ఉంటూ నీచమైన కామెంట్స్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై రాజకీయ నాయకుల్లోనే స్పష్టత లేదన్నారు. 
 
ఒక రోజు ప్రత్యేక హోదా కావాలంటారు.. మరో రోజు డబ్బులు కావాలంటారు. ఇలా మీలోనే ఓ క్లారిటీ లేదనీ, ఇక మాకేం క్లారిటీ ఉంటుందని నిలదీశారు. పైగా, మా ప్రొఫెషన్ అది కాదనీ, ఏదో ఓ మంచి సినిమా తీయడమని శివాజీ రాజా అన్నారు. ఆయన పూర్తి ప్రసంగానికి చెందిన వీడియోను మీరూ చూడండి.