శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 17 మార్చి 2018 (13:37 IST)

పవన్ పొలిటికల్ జన్మరహస్యం చెప్పిన తమ్మారెడ్డి... (Video)

ప్రతి విషయంపై నిర్భయంగా స్పందించే వ్యక్తి తమ్మారెడ్డి భరద్వాజ. ఆయన తెలుగు చిత్ర పరిశ్రమకు ఉన్న పెద్ద దిక్కుల్లో ఒకరు. ఏది మాట్లాడినా ముక్కుసూటిగా మాట్లాడుతారు. అలాంటి వ్యక్తి ఇపుడు జనసేన అధినేత పవన్ క

ప్రతి విషయంపై నిర్భయంగా స్పందించే వ్యక్తి తమ్మారెడ్డి భరద్వాజ. ఆయన తెలుగు చిత్ర పరిశ్రమకు ఉన్న పెద్ద దిక్కుల్లో ఒకరు. ఏది మాట్లాడినా ముక్కుసూటిగా మాట్లాడుతారు. అలాంటి వ్యక్తి ఇపుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ జన్మరహస్యం చెప్పారు. అసలు పవన్ ఎలాంటివారో, ఆయన నైజం ఎలాంటిదో చెప్పారు. 
 
అలాగే, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి హితోక్తులు చెపుతూనే ఆయన వైఖరిని ఎండగట్టారు. పవన్ కళ్యాణ్ అమ్ముడు పోయారంటూ చంద్రబాబు ఆరోపణలు చేయడం సబబు కాదంటున్నారు. అంతేకాకుండా, అవిశ్వాస తీర్మానం వ్యవహారంలో కూడా ద్వంద్వ వైఖరిని చంద్రబాబు అవలంభించారంటూ విమర్శలు గుప్పించారు.
 
ప్రత్యేక హోదా వద్దనీ, అవిశ్వాస తీర్మానం వద్దంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు చివరకు రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం దొంగలతో కూడా చేతులు కలుపుతామని చెప్పారు. ఆ తర్వాత స్వయంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం వెనుక ఆంతర్యమేమిటని తమ్మారెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు మాటలు చూస్తుంటే ఆయనలో ఎక్కడో భయం, ఆందోళన ఉన్నట్టు కనిపిస్తోందన్నారు. ఇదే అంశంపై తమ్మారెడ్డి భరద్వాజ తన స్పందనను తెలియజేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వాడియో మీరూ చూడండి.