గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2022 (11:14 IST)

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శివాత్మిక.. నెట్టింట వైరల్

Sivatmika
హీరో రాజశేఖర్ తనయ శివాత్మిక రాజశేఖర్ ప్రస్తుతం 'పంచతంత్రం' అనే సినిమాలో నటిస్తోంది. దీనితో పాటు తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతోన్న 'ఆకాశం' అనే సినిమాలోనూ నటిస్తోంది. 
 
వీటి షూటింగ్‌లు కూడా కంప్లీట్ అయ్యాయి. అలాగే, జీ-5లో ప్రసారం కానున్న 'అహ నా పెళ్లంట' అనే వెబ్‌ సిరీస్‌లోనూ కనిపించనుంది. రాజ్‌ తరుణ్‌ హీరోగా చేస్తున్న ఈ సిరీస్‌ను సంజీవ్‌ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు.
 
శివాత్మిక రాజశేఖర్ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నప్పటికీ.. తన పర్సనల్ లైఫ్‌ను కూడా తెగ ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ పార్టీలు చేసుకుంటూ రచ్చ చేస్తోంది. వీటికి సంబంధించిన అప్‌డేట్లను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తోంది. 
 
సోషల్ మీడియాలోనూ ఎంతో బిజీగా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. దీంతో తెగ హైలైట్ అయిపోతోంది.
 
స్టార్ డాటర్ శివాత్మిక రాజశేఖర్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె స్లీవ్‌లెస్ అండ్ షార్ట్ డ్రెస్‌ను ధరించి క్లీవేజ్ షో చేసింది. అంతేకాదు, సోఫాలో కూర్చుని అదిరిపోయే హాట్ ఫోజులు ఇచ్చింది. ఫలితంగా ఆమె అందాలు కనువిందు చేస్తున్నాయి.