1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శనివారం, 12 జులై 2025 (15:56 IST)

Sky: మనీ ట్రాన్సాక్షన్ లో జరిగిన మిస్టేక్ పాయింట్ తో స్కై టీజర్

Murali Krishnam Raju, Shruti Shetty
Murali Krishnam Raju, Shruti Shetty
మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి జంటగా నటిస్తున్న సినిమా "స్కై". ఈ చిత్రాన్ని వేలార్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టూడియోస్ బ్యానర్ లో నాగి రెడ్డి గుంటక, పృథ్వీ పెరిచెర్ల, శ్రీ లక్ష్మీ గుంటక, మురళీ కృష్ణంరాజు నిర్మిస్తున్నారు. పృథ్వీ పెరిచెర్ల దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
 
ఈ రోజు  "స్కై" సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఎంటర్ టైన్ మెంట్, ఎమోషన్ తో పాటు ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంది. మనీ ట్రాన్సాక్షన్ లో జరిగిన మిస్టేక్ హీరో హీరోయిన్స్ మధ్య ఒక బాండింగ్ కు ఎలా దారి తీసింది. హీరో విక్కీ తను అనుకున్న రెస్టారెంట్ బిజినెస్ లో సక్సెస్ అయ్యాడా లేదా అనేది టీజర్ లో ఆసక్తి కలిగించింది. హీరోయిన్ ప్రేమను హీరో విక్కీ ఎందుకు వద్దనుకున్నాడు, తన తండ్రికి సంబంధించి విక్కీకి ఉన్న గతమేంటి అనేది క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి.
నటీనటులు - మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ భారతి, రాకేశ్ మాస్టర్, ఎంఎస్, కేఎల్ కే మణి బమ్మ, తదితరులు