శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 మే 2020 (18:48 IST)

ప్రభాస్‌ సినిమాలో స్నేహ.. అరవింద్ స్వామికి అమ్మగా నటిస్తోందా? (video)

ఒకనాటి హీరోయిన్లు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోతున్నారు. తాజాగా రమ్యకృష్ణ క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీ లోకాన్ని ఏలుతోంది. ప్రస్తుతం స్నేహ లాంటి హీరోయిన్లు కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్నారు. నిన్నటి తరం హీరోయిన్లు అయిన భూమిక, స్నేహకు మంచి పాత్రలు ఇస్తున్నారు. అందులో ప్రధానంగా స్నేహకు ఇచ్చే పాత్రలు అన్నీ కూడా అగ్ర హీరోల సినిమాల్లోనే ఉంటున్నాయి. 
 
సినిమా ఫ్లాప్ అయినా సరే ఆమె పాత్ర మాత్రం చాలా బాగా క్లిక్ అవుతుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆమెను రెండు అగ్ర హీరోల సినిమాల్లో తీసుకునే ప్రయత్నాలను దాదాపుగా చేస్తున్నారు. మహేష్ బాబు సినిమాలో ఆమె ఖరారు అయింది. అలాగే ప్రస్తుతం ప్రభాస్ సినిమాలో కూడా ఆమెకు ఛాన్స్ వచ్చింది. 
 
ప్రభాస్ - నాగ్ అశ్విన్ సినిమాలో కూడా ఆమె విలన్ పాత్రలో ఉండే అవకాశం ఉందని సమాచారం. అంటే స్నేహ విలన్‌కి తల్లిగా నటిస్తుందని, అరవింద్ స్వామికి తల్లిగా ఆమె చేసే సూచనలు ఉన్నాయని టాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది. అయితే అరవింద్ స్వామి చిన్నప్పటి రోల్‌లో ఉంటుందని.. తర్వాత ట్విస్ట్ ఉంటుందని సమాచారం.