బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 అక్టోబరు 2021 (20:06 IST)

స్నేహా ఉల్లాల్ రీ ఎంట్రీ... బ్లాక్ డ్రెస్‌లో అదిరిపోయే లుక్

'ఉల్లాసంగా ఉత్సాహం'గా అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, జూనియర్ ఐశ్వర్యారాయ్‌గా పిలుచుకునే స్నేహా ఉల్లాల్ మళ్లీ టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తుంది. 'Eight' అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
గతంలో 'క‌రెంట్‌', 'సింహా' లాంటి హిట్ చిత్రాల‌తోపాటు తెలుగులో ప‌లు సినిమాలు చేసిన ఈ ఒమ‌న్ సుంద‌రి.. తెలుగు సినిమాలో క‌నిపించ‌క ఏడేళ్ల‌కు పైగానే అవుతుంది. సుదీర్ఘ విరామం త‌ర్వాత మ‌ళ్లీ ఇక్క‌డి ప్రేక్ష‌కుల ముందుకొచ్చేందుకు సిద్ధమైంది. 
 
స‌ప్త‌గిరి ప్రధాన పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో స్నేహా ఉల్లాల్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది. స్నేహా ఉల్లాల్ ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ తాజాగా రిలీజ్ చేశారు. బ్లాక్ డ్రెస్‌లో సీరియ‌స్ లుక్‌లో క‌నిపిస్తోంది. 
 
వివిధ భాష‌ల్లో థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో రిజ్వాన్ ఎంట‌ర్టైన్‌మెంట్‌పై ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. స్నేహా ఉల్లాల్ లుక్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేస్తుంది.