గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 20 ఫిబ్రవరి 2024 (15:57 IST)

సినిమా వెయ్యి కోట్లు వసూల్ కన్నా సేవాతో వచ్చే ఆనందం చాలా ఎక్కువ: సోనూసూద్

Shamshabad govt school opening
Shamshabad govt school opening
సమాజ సేవ కార్యక్రమాలలో భాగంగా శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని సిద్ధాంతిలో దాత కందకట్ల సిద్దు రెడ్డి సొంత నిధులతో నిర్మించిన నూతన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని బాలీవుడ్ సినీ నటుడు సోనుసూద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొని భవనాన్ని ప్రారంభించడంలో పాలుపంచుకున్నారు. పాఠశాల విద్యార్థులు సాంస్కృత కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పిల్లలకు స్కూల్ బ్యాగ్ లను, బుక్స్ ను సోనూసూద్ చేతుల మీదగా అందజేశారు. 
 
Shamshabad govt school opening
Shamshabad govt school opening
ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ.. తెలుగు ప్రజలు నా హృదయానికి చాలా దగ్గర. నేను పంజాబీ నుంచి వచ్చినా నా  సతీమణీ మాత్రం తెలుగు అమ్మాయి. సినిమా పరంగా నా  కెరియర్ కూడా తెలుగు నుంచే మొదలు అయింది. ఇక్కడే నటనలో వృద్ధి చెందాను.  అందుకే తెలుగు వాళ్లు అన్నా, తెలుగు అన్నా ప్రత్యేక అభిమానం.. చాలా మంది అంటుంటారు బాలీవుడ్ లో హీరోగా చేస్తావు, తెలుగులో విలన్ గా చేస్తావు ఎందుకు అని, తెలుగులో నటించడం అంటే ఎందుకో చాలా ఇష్టం అందుకే తెలుగు నుంచి ఏ క్యారెక్టర్ వచ్చినా కచ్చితంగా మీ కోసం చేస్తాను.
 
నా చేతుల మీదుగా పాఠశాలను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. స్కూల్ అనేది బాలీవుడ్, టాలీవుడ్ పరిశ్రమల కన్న చాలా గొప్పది.  నా సినిమా రూ. 500 కోట్లు వసూళ్లు చేసినా, రూ. 1000 కోట్లు వసూళ్లు చేసినా వచ్చే ఆనందం కన్నా ఇలాంటి సేవా కార్యక్రమం చేస్తే వచ్చే ఆనందం చాలా ఎక్కువ. కోవిడ్ సమయంలో సోనూసూద్ ఫౌండేషన్ ఎంత సేవా చేసిందో అందరికీ తెలిసిందే అలాగే సిద్ధు కూడా చాలా సోషల్ సర్వీస్ చేశారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఈ రోజు విద్యార్థుల కోసం ఉచిత పాఠశాల భవనాన్ని నిర్మించడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.
 
సేవా కార్యక్రమాలలో అన్నింటికన్నా ముఖ్యమైనది విద్యార్థులకు చదువు చెప్పించడం, మనలో కూడా వీలైనవాళ్లు ఒకరిద్దరి పిల్లల చదువుకు సాయం చేయాలి అని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పిల్లలకోసం, పాఠశాలలో కోసం నా అవసరం ఉంటే కచ్చితంగా తెలియచేయండి, నా వంతు సాయం తప్పకుండా ఉంటుందని, ఒక విద్యార్థి కూడా చదువుకు దూరం అవకూడదు అని బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్ తెలిపారు. 
 
సామాజిక సేవాకర్త, బిల్డింగ్ ప్రధాత కందకట్ల సిద్దు రెడ్డి మాట్లాడుతూ.. బాలీవుడ్ నటుడు సోనూసూద్ చేసే సేవా కార్యక్రమాలను చూసి, ఒక మనిషి తలుచుకుంటే ఇంత చేయగలడా అనే స్ఫూర్తితో తాను