Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పక్కా ప్లాన్ ప్రకారమే శ్రీదేవిని చంపేశారు: మాజీ ఏసీపీ

శుక్రవారం, 18 మే 2018 (15:21 IST)

Widgets Magazine

అందాల సినీ నటి శ్రీదేవిని పక్కా ప్లాన్‌తో చంపేశారనీ ఢిల్లీకి చెందన మాజీ వేద్‌భూషణ్ అనే వ్యక్తి ఆరోపించారు. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు ప్రకటించారు. శ్రీదేవి మృతిపై ఈయన చేసిన వ్యాఖ్యలు ఇపుడు వివావాదస్పదమయ్యాయి.
 
నటి శ్రీదేవి ఫిబ్రవరి 24న దుబాయ్‌లోని ఓ హోటల్‌లో ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆమె చనిపోయినప్పుడు శ్రీదేవి గుండెపోటుతో చనిపోయారని తొలుత దుబాయ్‌ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత పోస్ట్‌మార్టం నిర్వహించగా బాత్‌టబ్‌లో మునిగి చనిపోయినట్లు తేలింది. 
 
ఈనేపథ్యంలో వేద్‌భూషణ్ స్పందిస్తూ, 'బాత్‌టబ్‌లో బలవంతంగా ముంచి చంపడం చాలా సులువు. అలా చేస్తే మునిగి చనిపోయారని చెప్పి తప్పించుకునే అవకాశం ఉంటుంది. శ్రీదేవి ప్రమాదవశాత్తు చనిపోలేదు. ఆమెను పథకం ప్రకారం చంపేశారని నాకు అనిపిస్తోంది. దుబాయ్‌ వైద్యులు ఇచ్చిన ఫోరెన్సిక్‌ నివేదికపై నాకు సందేహాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాం' అని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. 
 
కానీ ఈ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఆమె మృతి విషయంలో తాము కలగజేసుకోలేమని తేల్చి చెప్పింది. కాగా, పదవీ విరమణ పొందాక భూషణ్‌ దిల్లీలో ఓ ప్రైవేట్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీని నడుపుతున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

''శ్రీనివాస కల్యాణం'' చూడాలంటే.. ఆగస్టు 9వరకు ఆగాల్సిందే..

నితిన్ హీరోగా నటించే శ్రీనివాస కల్యాణం సినిమా కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ ...

news

'‘కాశి'గా మళ్లీ ఊసురుమనిపించిన విజయ్ ఆంటోనీ.. (మూవీ రివ్యూ)

తెలుగు వెండితెరపై 'బిచ్చ‌గాడు' రూపంలో కనిపించి.. తొలి స‌క్సెస్ అందుకున్న తమిళ హీరో విజయ్ ...

news

'మహానటి' థియేటర్లో నటి హరితేజకు అవమానం... మీరు ఎవరిపక్కనైనా కూర్చుంటారంటూ...

మహానటి చిత్రం చూసేందుకు థియేటరుకు వెళ్లిన నటి హరితేజకు అవమానం ఎదురైంది. థియేటర్లో ఆమెను ...

news

శ్రీదేవిది హత్యే.. బాత్‌టబ్‌లో అలా చేసి సాక్ష్యం లేకుండా?: వేదభూషణ్

అందాల నటి శ్రీదేవి దుబాయ్‌లో మృతి చెందిన నేపథ్యంలో ఆమె మృతి సంఘటనలో తాము ఏమాత్రం జోక్యం ...

Widgets Magazine