Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శ్రీదేవి డెత్ మిస్టరీ : ఆయన అలా చెప్పారు.. రిపోర్టు ఇలా చెప్పింది...

మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (08:29 IST)

Widgets Magazine
sridevi

నటి శ్రీదేవి మృతి ఓ మిస్టరీగా మారనుంది. ఇప్పటికే అన్ని వేళ్లూ ఆమె భర్త బోనీ కపూర్‌ వైపు చూపిస్తున్నాయి. తన మేనల్లుడి వివాహం కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి... వివాహం, రిసెప్షన్ ముగిసిన తర్వాత కూడా దుబాయ్‌లోనే ఉండిపోయారు. అంతేనా, భర్తతో పాటు కుటుంబ సభ్యులంతా తిరిగి భారత్‌కు వస్తే శ్రీదేవి ఒక్కరే అక్కడ ఉండిపోయారు. ఆ తర్వాత అదే హోటల్ బాత్రూమ్‌ బాత్‌టబ్‌లో పడి చనిపోయారు. ఇది యావత్ దేశాన్ని షాక్‌కు గురి చేసింది. 
 
అయితే, శ్రీదేవి మృతిపై ఆమె మరిది సంజయ్ కపూర్ ఏమన్నారంటే... 'అవును, నటి శ్రీదేవి ఇకలేరు. శనివారం రాత్రి 11.00-11.30 గంటల సమయంలో ఆమె చనిపోయారు. ఇప్పుడే దుబాయ్‌ నుంచి ముంబై చేరుకున్నా. మళ్లీ దుబాయ్‌ వెళ్తున్నా. శ్రీదేవికి గతంలో ఎలాంటి హృదయ సంబంధిత అనారోగ్య సమస్యలూ లేవు. గుండెపోటు వచ్చిన సమయంలో ఆమెహోటల్‌ బాత్‌రూమ్‌లో ఉన్నారు'  అని వ్యాఖ్యానించారు.
 
అయితే దుబాయ్ ఫోరెన్సిక్ విభాగం ఇచ్చిన రిపోర్టు మాత్రం మరోలా ఉంది. "శ్రీదేవి స్పృహ కోల్పోయి, ప్రమాదవశాత్తు బాత్‌ టబ్‌లో మునిగి (యాక్సిడెంటల్‌ డ్రౌనింగ్‌) చనిపోయారు" అని మాత్రమే ఉంది. దీంతో శ్రీదేవి మృతిపై అనేకానేక అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బోనీపై డౌట్.. బాత్ టబ్‌లో పడితే.. ఫ్రెండ్‌కి ఎందుకు ఫోన్ చేశారు?

అతిలోక సుందరి శ్రీదేవి మృతిపై ట్విస్టుల మీద ట్విస్టులు మొదలయ్యాయి. శ్రీదేవి గుండెపోటుతో ...

news

శ్రీదేవి డెత్ మిస్టరీ: ఆ రెండు రోజుల్లో ఏం జరిగింది? ఆ నివేదిక నిజమైందేనా?

అతిలోక సుందరి శ్రీదేవి మృతి పట్ల ఫోరెన్సిక్ రిపోర్ట్ విడుదలైంది. అయితే ఆ నివేదిక పలు ...

news

నాగార్జున సరసన అనుష్క.. స్వీటీకి ''సూపర్'' ఛాన్స్

''మహానటి''లో భానుమతిగా భాగమతి హీరోయిన్ అనుష్క నటించనుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ...

news

''సాహో'' కోసం రామోజీ ఫిలిమ్ సిటీలో భారీ సెట్ వేయాల్సిందేనా?

రామోజీ ఫిల్మ్ సిటీలో ''సాహో'' సినిమా కోసం భారీ సెట్ వేయనున్నారని తెలుస్తోంది. ప్రభాస్ ...

Widgets Magazine