బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 25 మార్చి 2022 (16:49 IST)

స్టార్ హీరోస్ కేజీఎఫ్2 ట్రైల‌ర్ వేడుక‌కు గెస్ట్‌గా రాబోతున్నారు

Karan Johar poster
కేజీఎఫ్ చిత్ర హీరో య‌శ్ న‌టిస్తున్న కేజీఎఫ్2 చిత్రం ట్రైల‌ర్‌ను ఈనెల 27 ఆదివారం బెంగుళూరులో ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. ప‌లు భాష‌ల్లో విడుద‌ల‌కాబోతున్న ఈ చిత్ర వేడుక‌కు అన్ని చోట్ల‌నుంచి ప్ర‌ముఖ స్టార్స్ రాబోతున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే బాలీవుడ్ నుంచి క‌ర‌ణ్‌జోహార్ వ‌స్తున్న‌ట్లు ప‌బ్లిసిటీ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. అదేవిధంగా  క‌న్న‌డ స్టార్ శివ రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ పోస్టర్ ద్వారా తెలిపింది.
 
మిగిలిన రాష్ట్రాల‌నుంచి కూడా స్టార్స్ రాబోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమా ద‌క్షిణాది భాష‌ల‌తోపాటు హిందీలోనూ విడుద‌ల‌కానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని క‌ర్నాట‌క‌లో ప్ర‌ముఖ సంస్థ అయిన హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా, రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 14 వ తేదీన విడుదల కాబోతోంది.