శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 సెప్టెంబరు 2021 (09:19 IST)

శుభలేఖ సుధాకర్‌ ఇంట విషాదం : కన్నుమూసిన మాతృమూర్తి

ప్రముఖ సినీ నటుడు శుభలేఖ సుధాకర్ - ఎస్పీ శైలజ దంపతుల ఇంట విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి ఎస్ఎస్ కాంతం కన్నుమూశారు. ఆమె వయసు 82 సంవత్సరాలు. చెన్నైలో మంగళవారం ఆమె తుదిశ్వాస విడిచారు. 
 
శుభలేఖ సుధాకర్ తల్లి కాంతం మూడు నెలల కిందట గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆమెను నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. కానీ, అప్పటి నుంచి ఆమె కోలుకోలేక పోయారు. పైగా, ఆరోగ్యం బాగా దెబ్బతినడంతో ఆమె కన్నుమూశారు. 
 
వయసు పైబడడం, ఇతర అనారోగ్య కారణాలతో ఆమె పరిస్థితి విషమించగా, నిన్న ఉదయం మృతి చెందారు. ఆమె అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం చెన్నైలో జరగనున్నాయి. శుభలేఖ సుధాకర్ తండ్రి కృష్ణారావు రెండేళ్ల కిందటే కన్నుమూశారు.