Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'రంగ‌స్థ‌లం' గురించి క్లారిటీ ఇచ్చేసిన సుక్కు

మంగళవారం, 13 మార్చి 2018 (13:04 IST)

Widgets Magazine

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న క్రేజీ మూవీ రంగ‌స్థ‌లం. ఈ సినిమా 1985 టైమ్‌కి సంబంధించిన‌ది అని చెప్పారు కానీ… కాన్సెప్ట్ ఏమిటి అనేది మాత్రం రివీల్ చేయ‌లేదు. అయితే… రంగ‌స్థ‌లం రాజ‌కీయ నేప‌థ్యంతో సాగే క‌థ అంటూ ప్ర‌చారం మొద‌లైంది. ఇది నిజ‌మో కాదా అనే సందేహం ఉండేది. ఇప్పుడు ఈ సందేహాల‌కు క్లారిటీ ఇస్తూ.. ఓ పోస్ట‌ర్ రిలీజ్ చేసారు డైరెక్ట‌ర్ సుక్కు.
Aadi
 
రంగస్థలం సినిమా నుంచి ఆది పినిశెట్టి పోస్ట‌ర్ అది. ఈ ఒక్క ఫొటో చాలా విషయాల్ని చెప్పేసింది. మరీ ముఖ్యంగా రెండు విషయాలపై క్లారిటీ ఇచ్చింది. వీటిలో ఒకటి రంగస్థలం అనేది ఓ గ్రామం అనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. మ‌రొక‌టి పొలిటికల్ టచ్ ఉంటుందనే విషయంపై కూడా తాజా పోస్టర్‌తో క్లారిటీ వచ్చేసింది. 
 
ఆది కుమార్ బాబు పాత్రలో, లాంతరు గుర్తుపై ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న‌ స్టిల్ అది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన 3 కీలకమైన క్యారెక్టర్లను పరిచయం చేసినట్టయింది. రామలక్ష్మిగా సమంత, చిట్టిబాబుగా చరణ్, కుమార్ బాబుగా ఆది ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఈ స్టిల్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. మ‌రి... రంగ‌స్థ‌లం ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టిస్తుందో చూడాలి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

''అర్జున్ రెడ్డి''లో హీరోయిన్‌గా సుబ్బులక్ష్మి: అబ్బే అవన్నీ పుకార్లే గౌతమి

సీనియర్ నటి గౌతమి.. సినీ లెజెండ్ కమల్ హాసన్‌తో తెగతెంపులు చేసుకుంది. ప్రస్తుతం ...

news

ఎన్టీఆర్ బయోపిక్.. బసవతారకం రోల్ కోసం.. డర్టీ పిక్చర్ హీరోయిన్?

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, సినీ నటుడు, మాజీ సీఎం, స్వర్గీయ నందమూరి తారకరామారావు ...

news

డిఫ‌రెంట్ లుక్‌తో ఆది పినిశెట్టి... 'రంగస్థలం' న్యూ పోస్టర్

హీరోగా పరిచయమై.. ఆ తర్వాత విలన్‌గా కనిపిస్తున్న నటుడు ఆది పినిశెట్టి. ఈయన ప్రతి నాయకుడిగా ...

news

అయ్యబాబోయ్.. చనిపోయింది 'కైకాల' కాదు.. 'వంకాయల'

సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ చనిపోయినట్టు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. దీనిపై ...

Widgets Magazine