బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 15 మార్చి 2023 (18:42 IST)

సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా పరిచయం

Roshan Kanakala
Roshan Kanakala
క్షణం, కృష్ణ అండ్ హిస్ లీల లాంటి విజయవంత చిత్రాలతో ప్రశంసలు అందుకున్న దర్శకుడు రవికాంత్ పేరేపు, మహేశ్వరి మూవీస్ బ్యానర్‌లో కొత్త చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ యాంకర్ సుమ కనకాల, నటుడు రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని పి విమల నిర్మిస్తున్నారు.
 
రోషన్ కనకాల పుట్టినరోజు సందర్భంగా, చిత్ర బృందం డిజెగా వైబ్రెంట్ అవతార్‌లో పోస్టర్‌ను విడుదల చేసింది. పోస్టర్‌లో రోషన్ గిరజాల జుట్టు, సన్ గ్లాసెస్‌తో, DJ సిస్టమ్‌లో మ్యూజిక్ ప్లే చేస్తూ హెడ్‌సెట్ ధరించి కనిపించారు. ఈ పోస్టర్ చాలా ట్రెండీగా వుంది.  
 
ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం న్యూ ఏజ్ రోమ్-కామ్‌గా రూపొందుతోంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా, నవీన్ యాదవ్ కెమెరా మెన్ గా పని చేస్తున్నారు. రవికాంత్ పేరేపు తో పాటు, విష్ణు కొండూరు, సెరి-గన్ని  రచయితలు.  వంశీ కృష్ణ స్క్రీన్ ప్లే కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. శివమ్‌రావు ప్రొడక్షన్‌ డిజైన్‌ నిర్వహిస్తునారు.