గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : మంగళవారం, 21 మే 2019 (18:39 IST)

55 వసంతాలు పూర్తి చేసుకున్న సురేష్ ప్రొడక్షన్స్..

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థలలో మూవీమొగల్ డా.డి. రామానాయుడు స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్ ఒకటి. ఈ సంస్థ ఇప్పటికే 120కు పైగా చిత్రాలను నిర్మించింది. ఈ సంస్థ నుండి మొదటిగా ఇదే రోజున అనగా మే 21వ తేదీన సీనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో నటించిన 'రాముడు - భీముడు' చిత్రం విడుదలై ఇప్పటికి సరిగ్గా 55 ఏళ్ళు పూర్తయింది. 
 
గడిచిన ఐదున్నర దశాబ్దాల కాలంలో ఈ సంస్థ బ్యానర్‌లో రామానాయుడు గారు అనేక భారతీయ భాషల్లో చిత్రాలను నిర్మించారు. తెలుగులో ఈ సంస్థ నుండి వచ్చిన సినిమాలలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే శ్రీకృష్ణ తులాభారం, ప్రేమ్ నగర్, సెక్రెటరీ, దేవత, మాంగల్య బలం, బొబ్బిలి  రాజా, కూలీ నెం 1 లాంటి అనేక హిట్ సినిమాలు ఉన్నాయి. ఎందరో నటీనటులను, దర్శకులను, టెక్నీషియన్‌లను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత ఈ సంస్థకు దక్కడం విశేషం.