మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : గురువారం, 19 మార్చి 2020 (11:32 IST)

సుశాంత్‌కి ఈ సినిమా వర్కవుట్ అవుతుందా..?

కాళిదాసు సినిమాతో హీరోగా పరిచయమై.. తొలి సినిమాతో కమర్షియల్ సక్సస్ సాధించకపోయినా... నటుడుగా మంచి పేరు తెచ్చుకున్న అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్. ఆ తర్వాత నటించిన కరెంట్, అడ్డా, ఆటాడుకుందాం రా.. చిత్రాలు ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేకపోయినా... నటుడుగా మాత్రం ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. 
 
ఈ సినిమాలు టీవీల్లో వస్తే.. మంచి రేటింగ్ దక్కించుకుంటాయి. అయితే.. బాక్సాఫీస్ వద్ద మాత్రం బిగ్ హిట్ రాలేదు.  సరైన సక్సస్ కోసం ఎదురు చూస్తున్న టైమ్ లో చిలసౌ అనే విభిన్న కథా చిత్రం చేసాడు. ఈ సినిమా ద్వారా రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా కమర్షియల్ గా కూడా సక్సస్ అయ్యింది. 
 
కెరీర్ లో ఓ మంచి సినిమా చేసాడు.. కమర్షియల్ గా కూడా సక్సస్ సాధించాడు. ఈ సినిమాతో సుశాంత్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈసారి హీరోగా మరో విభిన్న కథా చిత్రం చేస్తాడు అనుకుంటున్న టైమ్ లో సుశాంత్,  బన్నీ అల.. వైకుంఠపురములో నటించడం విశేషం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అల... వైకుంఠపురములో సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సుశాంత్ కి మంచి పేరు తీసుకువచ్చింది. 
 
ఇదిలా ఉంటే... ఈ మూవీ ఇచ్చిన విజయంతో సుశాంత్ హీరోగా ఓ డిఫరెంట్ మూవీని స్టార్ట్ చేసారు. అదే ఇచ్చట వాహనాలు నిలుపరాదు. ఈ విభిన్న కథా చిత్రానికి నూతన దర్శకుడు ఎస్.దర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. వెరైటీగా ఉన్న ఈ టైటిల్ కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. 
 
lతాజాగా సుశాంత్ ఇప్పుడు యాడ్స్‌లో కూడా నటించాడు. స్పైట్‌తో సుశాంత్ యాడ్స్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. సుశాంత్ నటించిన యాడ్ రిలీజైంది. ఈ యాడ్ లో సుశాంత్ లుక్ చాలా బాగుంది.. యాడ్ ఇంకా బాగుంది అంటూ పాజిటివ్ గా రెస్పాన్స్ వస్తుంది.
 
 ఇచ్చట వాహనములు నిలుపరాదు. నో పార్కింగ్ అనే టాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని రవి శంకర్ శాస్త్రి, హరీష్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 
 
డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన రైడ్ విత్ సుశాంత్ అనే ప్రత్యేక వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ వీడియోకు మంచి స్పందన లభిస్తుంది.  సుశాంత్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ స్టోరీ ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం ద్వారా కెరీర్ మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు సుశాంత్..!