Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నాగ్ నుంచి అఖిల్ దాకా.. ఆ కుటుంబంలో ఎవరినీ వదలని పొడుగాటి సుందరి

హైదరాబాద్, శుక్రవారం, 2 జూన్ 2017 (04:15 IST)

Widgets Magazine

దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో మెరుపులా మెరిసి ప్రస్తుతం బాలీవుడ్‌కి పరిమితమైన పొడుగుకాళ్ల సుందరి టబు టాలీవుడ్‌లో సరసన నిన్నే పెళ్లాడుతా సినిమాలో నటించి ప్రేమికుల హృదయాలను కొల్లగొట్టింది. ప్రేమలోని సున్నితభావాన్ని, కుటుంబ బంధాల గొప్పతనాన్ని అజరామరంగా చిత్రించిన ఆ సినిమా నాగార్జున చిత్రాల్లో అద్భుత ప్రేమ చిత్రంగా మిగిలిపోయింది. ఇక టబు అయితే ఆనాటినుంచి నేటివరకూ నాగ్ ప్యామిలీకి అత్యంత సన్నిహితురాలిగా మారిపోయింది. 
 
తండ్రితో ప్రేమరసాన్ని చిరస్మరణీయంగా అభినయించిన అందాల టబు ఇప్పుడు ఆ తండ్రి కుమారుడు అఖిల్‌ సినిమాలో నటించడానికి సిద్ధమైపోయింది. అఖిల్ బాలనటుడిగా తెరకెక్కిన సిసింద్రీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన టబు, ఇప్పుడు అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ చేస్తోంది. అయితే టబు చేస్తుంది తల్లి పాత్రే అయినా..అది హీరో తల్లి పాత్రనా.. లేక హీరోయిన్ తల్లి పాత్రనా తెలియాల్సి ఉంది.
 
తొలి సినిమాతో నిరాశపరిచిన అఖిల్ రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలో ప్రారంభం కానున్న రెండో షెడ్యూల్‌లో టబు పై సన్నివేశాలను చిత్రీకరించేలా ప్లాన్ చేస్తున్నారు.  మనం, 24 సినిమాల ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకక్కుతున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది.
 
తెలుగు సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన టబు, తరువాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. గతంలో నాగ్ సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన ఈ బ్యూటి అక్కినేని కుటుంబంతో మంచి రిలేషన్ మెయిన్‌టైన్ చేస్తున్న విషయం తెలిసిందే.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మహేష్ బాబుకు రాజమౌళి ఫీవర్... జక్కన్నను కలిస్తే ఆ మాటన్నాడట...

మహేష్‌ బాబు చిన్నతనం నుంచి నటనలో తనదైన శైలిలో రాణిస్తున్న హీరో. యువ కథనాయకుల్లో మహేష్ ...

news

టాప్-100లో ఆ ఇద్దరు.. మోడీ ముందు ప్రియాంక లెగ్స్.. కేటీఆర్ ముందు జిల్ ఎలా కూర్చుందో చూడండి..

మాగ్జిమ్ అనే పత్రిక 2017 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే అత్యంత హాట్ బ్యూటీ ఎవరనే దానిపై ...

news

మహేష్‌, మురుగదాస్‌ల 'స్పైడర్‌' టీజర్‌కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, ...

news

మనదేశంలోనే సమంతతో నా పెళ్ళి.. సమ్మూ అల్లరి పిల్ల.. మంచమ్మాయి: నాగ చైతన్య

అక్కినేని నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లికి సంబంధించిన విశేషాలను తెలిపాడు. రారండోయ్ ...

Widgets Magazine