గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 30 అక్టోబరు 2018 (09:17 IST)

"ఎఫ్2" కోసం తమన్నా స్టన్నింగ్ లుక్...

విక్టరీ వెంకటేష్, యువ హీరో వరుణ్ తేజ్‌లు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం "ఎఫ్.2" (ఫన్ అండ్ ఫ్రస్టేషన్). ఈ చిత్రంలో హీరోయిన్లుగా తమన్నా, మెహ్రీన్‌లు నటిస్తున్నారు. 'పటాస్'‌, 'సుప్రీమ్'‌, 'రాజా ది గ్రేట్‌' చిత్రాలతో హ్యాట్రిక్‌ హిట్‌ను అందుకున్న అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.
 
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు నిర్మిస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ల కాంబినేషన్‌ మొదటిసారికావడంతో మంచి క్రేజ్‌ నెలకొంది. ఇందులో రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు.
 
దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలనుకుంటున్నారు. కాగా ఈ మూవీలోని తమన్నా లుక్‌ని చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. ఈ స్టన్నింగ్ లుక్‌లో తమన్నా మెరిసిపోతోంది. ఆ లుక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.