మిరాయ్ కోసం రైలు పైన నిలబడి రిస్కీ స్టంట్ చేసిన తేజ సజ్జా
సూపర్ హీరో తేజ సజ్జా సూపర్ యోధగా తన అడ్వంచరస్ యాక్టింగ్ తో అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు, మే 28న తన మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'మిరాయ్' టీజర్ విడుదల కానుంది. ఈ గ్లింప్స్ ఖచ్చితంగా గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది, ప్రేక్షకులను సినిమా కోసం క్రియేట్ చేసిన కొత్త ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. ఈ ఎక్స్ ట్రార్డినరీ టీజర్ చూడటానికి మరో రెండు రోజులు వేచి ఉండాలి.
టీజర్ పోస్టర్ తేజ సజ్జా చేతిలో మంత్రదండం పట్టుకుని నడుస్తున్న రైలు పైన నిలబడి, రిస్కీ స్టంట్ చేస్తూ క్యారెక్టర్ బోల్డ్ నేచర్ ని ప్రజెంట్ చేస్తోంది. ఈ సినిమాలో మనోజ్ మంచు విలన్ నటించగా, రితికా నాయక్ కథానాయికగా నటించింది.
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ యాక్షన్-అడ్వెంచర్ ముంబైలోని చారిత్రాత్మక గుహలలో కొత్త షూటింగ్ షెడ్యూల్ జరుగుతోంది. తేజ సజ్జాతో పాటు, కొంతమంది ప్రధాన తారాగణం ఈ తాజా షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు.
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రఫీ, స్క్రీన్‌ప్లేను కూడా అందించగా, మణిబాబు కరణం డైలాగ్స్ రాశారు. గౌరహరి సంగీతం అందించగా, శ్రీ నాగేంద్ర తంగల ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. సుజిత్ కుమార్ కొల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
ఈ చిత్రం 2D, 3D ఫార్మాట్లలో 8 భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.