1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 ఫిబ్రవరి 2024 (21:49 IST)

గవర్నర్ తమిళసైను కలిసిన పద్మవిభూషణ్ చిరంజీవి దంపతులు

Chiranjeevi
Chiranjeevi
తెలంగాణ గవర్నర్, డా. తమిళిసై సౌందరరాజన్, శుక్రవారం నాడు రాజ్‌భవన్‌లో మెగాస్టార్ చిరంజీవికి తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. పద్మవిభూషణ్‌తో ప్రతిష్టాత్మకమైన గుర్తింపు పొందినందుకు చిరంజీవిని సత్కరించారు. 
 
మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో శుక్రవారం గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డాక్టర్ సౌందరరాజన్ చిరంజీవికి పుష్పగుచ్ఛాన్ని అందించి, చిత్రసీమలో అంతకు మించి ఆయన సాధించిన విశేషమైన విజయాలకు గాను ప్రశంసించారు. తనను సత్కరించినందుకు గాను మెగాస్టార్ చిరంజీవి గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.
 
ఇంకా చిరంజీవి మాట్లాడుతూ, "ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు నేను నిజంగా వినయపూర్వకంగా, కృతజ్ఞతతో ఉన్నాను. ఇది నా కెరీర్‌లో నా అభిమానులు, శ్రేయోభిలాషుల నుండి నాకు లభించిన ప్రేమ, మద్దతుకు నిదర్శనం." అంటూ పేర్కొన్నారు.
 
అలాగే గవర్నర్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాని ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో చిరంజీవి ముఖ్యమైన పాత్రను పేర్కొంటూ, తన సినిమాల ద్వారా తెలుగు సంస్కృతి, భాషను ప్రోత్సహించడంలో చిరంజీవి నిబద్ధతను కొనియాడారు. సామాజిక సమస్యలపై అవగాహన పెంపొందించడంలో ఆయన ప్రయత్నాలను, ధార్మిక కార్యక్రమాలకు ఆయన చేసిన సహకారాన్ని ఆమె మరింత మెచ్చుకున్నారు.