సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

వచ్చే నెల ఒకటో తేదీ నుంచి టాలీవుడ్‌లో మళ్లీ షూటింగులు

tollywood industry
తెలుగు చిత్రపరిశ్రమలో ఆగిపోయిన సినిమా షూటింగులు మళ్లీ పునఃప్రారంభంకానున్నాయి. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి తిరిగి యధావిధిగా షూటింగులు ప్రారంభమవుతాయని నిర్మాతల మండలి వెల్లడించింది. అలాగే, ఈ నెల 25వ తేదీ నుంచి విదేశాల్లో షూటింగులు మొదలువుతాయని పేర్కొంది. 
 
వివిధ కారణాలతో ఈ నెల ఒకటో తేదీ నుంచి తెలుగు చిత్రపరిశ్రమలో అన్ని తెలుగు చిత్రాల షూటింగులు నిలిచిపోయిన విషయం తెల్సిందే. ఈ షూటింగుల బంద్‌కు అనేక సినీ సంఘాల మద్దతు కూడా లభించింది. ఈ నేపథ్యంలో తమ సమస్యల పరిష్కారం కోసం బడా నిర్మాత దిల్ రాజు గత కొన్ని రోజులుగా వివిధ రంగాలకు చెందిన సినీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. 
 
ఈ కొంతమేరకు ఫలించడంతో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి తిరిగి షూటింగులు ప్రారంభించాలని నిర్ణయించారు. గత 23 రోజులుగా సినీ రంగ సమస్యలపై చర్చించామని, దీనిపై ఆగస్టు 30వ తేదీన ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేస్తామని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రకటించింది. 
 
ఇదే అంశంపై నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ, విదేశాల్లో చిత్రీకరణలు జరుపుకుంటున్న చిత్రాలు ఈ నెల 25వ తేదీ గురువారం నుంచి యధావిధిగా షూటింగులు జరుపుకోవచ్చని తెలిపారు. అత్యవసరమైతే ఫిల్మ్ చాంబర్‌ అనుమతితో ఆగస్టు 25 నుంచి స్వదేశంలో షూటింగులు జరుపుకునే వెసులుబాటు కల్పించినట్టు తెలిపారు.