తప్పతాగి.. కారు కింద నక్కిన హాస్యనటుడు...

ఆదివారం, 3 డిశెంబరు 2017 (15:09 IST)

naveen

పీకల వరకు మద్యం సేవించి, కారు డ్రైవ్ చేస్తూ వచ్చి పోలీసులకు చిక్కాడు. అయితే, ఖాకీలకు చిక్కకుండా ఉండేందుకు కారు కింద దాక్కున్నాడు. అతను ఎవరో కాదు. టాలీవుడ్ హాస్య నటుడు. పేరు నవీన్. ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ నగర పోలీసులు శనివారం రాత్రి జూబ్లీహిల్స్‌‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. అపుడు మద్యం తాగి వాహనం నడుపుతున్న నవీన్‌ను పోలీసులు గుర్తించారు. అంతే, వారి నుంచి తప్పించుకునేందుకు కారు కిందకు దూరాడు. అయితే అతన్ని గుర్తించి ఆల్కహాల్‌ పరీక్షలు నిర్వహించారు. 
 
ఈ ఘటనకు సంబంధించి నవీప్‌పై కేసు నమోదుచేసి.. అతని వాహనాన్ని సీజ్‌ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్న కమెడియన్‌ నవీన్‌ 'జబర్దస్త్' టీవీ షోలో కూడా పాల్గొన్నాడు. గోపీచంద్‌ హీరోగా వచ్చిన 'ఆక్సిజన్' సినిమాలోనూ నవీన్‌ నటించాడు. 
 
మరోవైపు, గత నెల 27 నుంచి ఈ నెల 1వ తేదీ వరకు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 329 చార్జిషీట్లు కోర్టులో దాఖలు చేయగా ఎర్రమంజిల్ 3,4 మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులు 39 మందికి జైలు శిక్షలు ఖరారు చేస్తూ తీర్పులు చెప్పాయని నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ డాక్టర్ రవీందర్ తెలిపారు. 
 
అలాగే, ఒకరి లైసెన్స్‌ను రద్దు చేయగా, మరో ముగ్గురి లైసెన్స్‌లు సస్పెండ్ చేశారని, అందులో ఒకరిది ఒక సంవత్సరం, ఇద్దరిది ఆరు నెలల పాటు సస్పెండ్ అయ్యాయని ఆయన వెల్లడించారు. 5 రోజుల నుం చి 2 రోజుల వరకు జైలు శిక్షలు ఖరారయ్యాయని, జైలు శిక్షలు పడ్డవారిని చంచల్‌గూడ జైల్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

#OkkaKshanam టీజర్ : లవ్ వర్సెస్ డెస్టినీ

'ఎక్కడికి పోతావు చిన్నవాడా'తో తన ప్రతిభ ఏంటో నిరూపించుకున్న దర్శకుడు వీఐ ఆనంద్. ఈయన రెండో ...

news

శ్రీముఖి అందాలను జుర్రుకున్నానంటున్న నందు

నందు, శౌర్య, శ్రీముఖి, రోషిణి ప్రధాన పాత్రల్లో జేపీ క్రియేషన్స్ బ్యానర్‌పై ధ‌న జమ్ము ...

news

నిత్యతో 'అ'లా మొదలైందంటున్న హీరో నాని

చూడగానే ఆకట్టుకునే ఫేస్‌తో కైపైన చూపుతో యూత్‌ని ఇట్టే ఆకర్షించే మలయాళ కుట్టి నిత్యా ...

news

ఓవర్సీస్‌లో కలెక్షన్ల కింగ్ ఎవరు?

ప్రపంచ క్యాలెండర్ చరిత్రపుటల్లో మరో యేడాది కలిసిపోనుంది. మరికొన్ని రోజుల్లో 2017వ ...