బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 22 ఆగస్టు 2018 (11:07 IST)

రియల్ హీరోలు : విజయ్ రూ.70 లక్షలు... సుశాంత్ రూ.కోటి విరాళం

కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా, సెలెబ్రిటీలు అయితే తమకు తోచిన విధంగా విరాళాలు ప్రకటిస్తున్నారు. అయితే, సీనియర్ హీరోల కంటే.. జూనియర్ హీరోలే అధిక మొత్తంలో సాయ

కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా, సెలెబ్రిటీలు అయితే తమకు తోచిన విధంగా విరాళాలు ప్రకటిస్తున్నారు. అయితే, సీనియర్ హీరోల కంటే.. జూనియర్ హీరోలే అధిక మొత్తంలో సాయం చేస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
 
ఈ కోవలో త‌మిళ స్టార్ హీరోల‌లో ఒక‌రైన విజ‌య్ త‌న అభిమాన సంఘాల‌తో క‌లిసి 70 ల‌క్ష‌ల రూపాయలను కేరళ వ‌ర‌ద బాధితుల‌కి ఇస్తాన‌ని చెప్పాడు. అంతేకాదు త‌న అభిమానుల‌ని వారికి చేయూత‌నందించాల‌ని కోరాడు. ప్ర‌స్తుతం విజ‌య్ "స‌ర్కార్" చిత్రంతో బిజీగా ఉన్నాడు.
 
ఇకపోతే, బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఏకంగా కోటి రూపాయలను కేర‌ళ వ‌ర‌ద బాధితుల కోసం విరాళంగా ఇచ్చారు. త‌న ఫ్రెండ్ సాయంతో తాను ఈ ప‌ని చేసాన‌ని సుశాంత్ చెప్పుకొచ్చాడు. దక్షిణాది రాష్ట్రం కేరళలోలో జరిగిన ఈ విపత్తుకు బాలీవుడ్ యువ నటుడు ఇంత పెద్ద మొత్తంలో విరాళంను ప్రకటించడం విశేషం.
 
మరోవైపు, కేరళ వరద బాధిత కష్టాలను చూసి కరిగిపోయిన అనేక మంది సెలెబ్రిటీలు విరాళాలు ఇస్తున్నారు. ఇలాంటివారిలో చిరంజీవి, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, మహేష్ బాబు, ర‌జినీకాంత్, క‌మ‌ల్ హాస‌న్‌, రామ్ చ‌ర‌ణ్, అల్లు అర్జున్, నాగార్జున‌, వ‌రుణ్ తేజ్‌, రామ్‌, విజయ్ సేతుప‌తి, ధ‌నుష్‌, న‌య‌న‌తార‌, కీర్తి సురేష్‌, సిద్దార్ద్‌, విశాల్‌, జ‌యం ర‌వి, సూర్య‌, కార్తీ అలా అనేక మంది కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటించారు.